ప్రియుడు వేదిస్తున్నడంటూ బుల్లితెర నటి నీలాణి

ప్రియుడు వేదిస్తున్నడంటూ బుల్లితెర నటి నీలాణి

పెళ్లి చేసుకోవాలని తనను బలవంతం చేస్తున్నాడంటూ బుల్లితెర నటి నీలాణి తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మైలాపూర్ పోలీసులను ఆశ్రయించిన తమిళ నటి నీలాణి.. పని చేసే చోటుకు వచ్చి పచ్చి బూతులు తిడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది.

టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ పేరు తెచ్చుకుంటోంది. గాంధీ లలిత్‌కుమార్‌ అనే వ్యక్తితో ఆమెకు మూడేళ్ల కిందట పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి మధ్య మనస్పర్థల కారణంగా కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నటి నీలాణి ఆదివారం స్థానిక మైలాపూర్‌లో జరుగుతున్న ఓ సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొంది. షూటింగ్ స్పాట్‌కు వచ్చిన లలిత్ కుమార్.. తనను పెళ్లి చేసుకోవాలని నీలాణిని అడిగగా అందుకు ఆమె నిరాకరించింది.