పూరీ పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్న బాలయ్య

పూరీ పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్న బాలయ్య

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో పూరి తన మార్క్ ను చూపించడంతో పాటు మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ దక్కడం.. సక్సెస్ వచ్చిన తర్వాత రాబోతున్న పుట్టిన రోజు అవ్వడంతో పూరి బర్త్ డేను వైభవంగా నిర్వహించేందుకు ఆయన నిర్మాణ భాగస్వామి అయిన ఛార్మి ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 28న పూరి జగన్నాధ్ బర్త్ డే వేడుకను వైభవంగా ఛార్మి ప్లాన్ చేసింది.

రేపు పూరి కొత్త సినిమా విషయాలను ఛార్మి ప్రేక్షకులతో షేర్ చేసుకోబోతుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో ఒక చిత్రాన్ని ఒప్పుకున్నారు . ఆ సినిమా అప్ డేట్స్ ఇవ్వడంతో పాటు పూరి మరో సినిమాను కూడా ఛార్మి అనౌన్స్ చేయబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండతో మూవీ ప్రారంభించకుండానే పూరి తన తదుపరి చిత్రంను బాలయ్యతో చేసేందుకు ఆయన్ను ఒప్పించాడు. బాలకృష్ణతో గతంలో పైసా వసూల్ చిత్రం చేసిన పూరి ఆ చిత్రంతో పరాజయం చవిచూశాడు.

ప్రస్తుతం రెండు సినిమాలకు ఒప్పుకున్న  బాలకృష్ణ 107వ చిత్రంకు పూరి డైరెక్ట్ చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూరి బాలయ్యల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయినా కూడా పూరి బర్త్ డే వేడుక సందర్బంగా టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ లో బాలయ్య పూరిల కాంబో మూవీ త్వరలో పట్టాలెక్కబోతుందని ఛార్మి ప్రకటించబోతుంది. ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న కారణంగా రెండు మూడు రోజులుగా పూరి పుట్టిన రోజు కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.