బాలయ్యది స్పీడ్… వర్మ కి ఫైట్

Balakrishna NTR Biopic movie release on NTR Birthday

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా పోటాపోటీ సినిమాల మీదే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ. ఇక టీడీపీ నాయకులతో ” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” దర్శకుడు వర్మ చేస్తున్న ఫైటింగ్ అందరికీ వినోదం పంచుతోంది. తన సినిమా మీద కామెంట్ చేస్తున్న టీడీపీ నాయకుల కి క్వశ్చన్ టూ ఆన్సర్ లెవెల్ లో వర్మ లొల్లిలొల్లి చేస్తున్నాడు. ఈ గొడవలో పడి ఫిబ్రవరి లో మొదలుకావాల్సిన సినిమా స్క్రిప్ట్ మీద ఇంకా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. స్టోరీ లైన్ ఇది అనుకున్నారు తప్ప ఇంకా స్క్రిప్ట్ మీద సీరియస్ గా కసరత్తు చేసింది లేదట. ఇక నటుల విషయానికి వచ్చేసరికి ఈ సినిమా వివాదం అవుతుందని భావించిన చాలా మంది “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” లో నటించడానికి ముందుకు రావడం లేదు. వర్మ ఫైట్ ఇలా ఉంటే బాలయ్య స్పీడ్ ఇంకోలా వుంది.

” ఎన్టీఆర్ బయోపిక్” విషయంలో బాలయ్య, తేజ ఫుల్ స్పీడ్ లో వున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తి అయ్యింది. షూటింగ్ లొకేషన్స్ కూడా దాదాపు ఖరారు చేశారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో కొంత భాగం, చెన్నైలో ఇంకొంత భాగం షూటింగ్ జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిమ్మకూరు, చెన్నై లో ఎన్టీఆర్ నివసించిన ఇంట్లో షూటింగ్ చేయడానికి అవసరం అయిన అనుమతులు తీసుకున్నారు. అంతా అనుకున్నట్టు షూటింగ్ జరిపి ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 28 న సినిమా విడుదలకి నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ మిస్ కాకుండా చూసేందుకు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో స్పీడ్ స్పీడ్ గా ముందుకు వెళ్తున్నాడు.