‘హౌరాబ్రిడ్జ్‌’ టీజర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌…

Howrah Bridge Movie Teaser gets Super Response

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా తెరకెక్కుతున్న ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. టీజర్‌తో సినిమాపై సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. టీజర్‌ను చూస్తుంటే సినిమాలో మ్యాటర్‌ ఉంటుందని అనిపిస్తుంది అంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ టీజర్‌కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ దక్కింది. తక్కువ సమయంలోనే భారీ వ్యూస్‌ను ఈ టీజర్‌ రాబట్టుకుంది. ఇక ఈ టీజర్‌పై సినీ ప్రముఖులు కూడా పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఖచ్చితంగా సినిమా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అనిపిస్తుంది అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

విభిన్న ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో యూత్‌ఫుల్‌ ఎలిమెంట్స్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే సీన్స్‌ కూడా ఉన్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. హీరో, హీరోయిన్‌ల మద్య ఉన్న రొమాంటిక్‌ సీన్స్‌కు యూత్‌ ఆడియన్స్‌ ఫిదా అవ్వడం ఖాయం. ఇక టీజర్‌లో ఉన్న డైలాగ్‌ ప్రామీస్‌ చేసే పద్దతి ఇది కాదేమో.. కు యూత్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌ తన లుక్స్‌తో, ఛాందిని చౌదరి తన గ్లామర్‌తో సినిమాకు హైలైట్‌గా నిలుస్తారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమాను పంపిణీ చేసేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.