పెళ్లి తర్వాత సమంత మొదటిసారి…!

samantha-akkineni-planning-for-mahanati-movie-shooting-after-marriage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినిమా తారలు పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం నెల రెండు నెలలు అయినా షూటింగ్‌లకు, మీడియాకు దూరంగా ఉంటారు. కాని సమంత మాత్రం పెళ్లి అయ్యి వారం కూడా తిరగకుండానే ‘రాజు గారి గది 2’ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంది. ఇక అప్పుడే షూటింగ్స్‌కు కూడా హాజరు అయ్యేందుకు సిద్దం అయ్యింది. దాదాపు రెండు నెలల పాటు సమంత, నాగచైతన్యలు హనీమూన్‌ను విదేశాల్లో ప్లాన్‌ చేసుకున్నారు అంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఆ వార్తలు నిజం కాదని, తాము హనీమూన్‌ లాంటిది ఏమీ ప్లాన్‌ చేయలేదని ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. పెళ్లి అయిన వెంటనే ఇద్దరం కూడా షూటింగ్స్‌తో బిజీ అవుతామని కూడా సమంత చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే సమంత అప్పుడే షూటింగ్స్‌కు సిద్దం అయ్యింది.

ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలతో పాటు తెలుగులో రామ్‌ చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’ చిత్రం మరియు ‘మహానటి’ చిత్రంలో ముఖ్య పాత్రను సమంత చేస్తోంది. మొదటగా ‘మహానటి’ సినిమా కోసం సమంత 15 రోజుల డేట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ మరియు పరిసర ప్రాంతాల్లో ‘మహానటి’ సినిమా షూటింగ్‌ను జరుపబోతున్నారు. అతి త్వరలోనే షూటింగ్‌లో సమంత జాయిన్‌ కాబోతుంది. పెళ్లి తర్వాత మొదటి సారి సమంత ‘మహానటి’ కోసం కెమెరా ముందుకు వెళ్లబోతుంది. ఆ సినిమాలో చాలా కీలకమైన పాత్రను సమంత పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.

‘మహానటి’ చిత్రం షూటింగ్‌లో 15 రోజులు పాల్గొన్న తర్వాత వారం రోజులు గ్యాప్‌ తీసుకుని రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత తమిళ సినిమాల షూటింగ్‌లో పాల్గొబోతుంది. మొత్తానికి సమంత పెళ్లి తర్వాత కూడా చాలా బిజీగా ఉంది. మరో వైపు నాగచైతన్య కొత్త సినిమాను మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. త్వరలోనే చైతూ కూడా కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ అవ్వబోతున్నాడు.