పైసా వసూల్ ప్రివ్యూ .

Balakrishna paisa vasool Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  బాలకృష్ణ , శ్రియ , ముస్స్కాన్ సేతి 
నిర్మాత :    ఆనంద్ ప్రసాద్ 
దర్శకత్వం :   పూరి జగన్నాధ్ 
మ్యూజిక్ డైరెక్టర్ :   అనూప్ రూబెన్స్ 
ఎడిటర్ :    జునైద్ సిద్దికి 
సినిమాటోగ్రఫీ :  ముకేష్ 

నటసింహం బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాధ్… ఈ కాంబినేషన్ గురించి అది సెట్ అయ్యే దాకా ఎవరూ ఊహించి వుండరు. చివరకు బాలయ్య, పూరి కూడా. అంత చిత్రమైన కాంబినేషన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. నిజానికి మాస్ హీరోగా బాలయ్యని ఇంతకు ముందు ఎన్నో సార్లు చూసాం. ఇప్పుడు పూరి చూపించినంత ఊర మాస్ గా ఇంకే దర్శకుడు చూపించలేదు. అసలు ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే బాలయ్య ఫాన్స్ నిరాశ పడ్డారు. ప్లాప్స్ లో వున్న పూరికి ఛాన్స్ ఎందుకు ఇచ్చాడబ్బా అని గొణుక్కున్నారు.

అయితే ఒక్క ట్రైలర్ తో ఆ అసంతృప్తి మొత్తం పోయి కొత్త ఉత్సాహం వచ్చింది. బాలయ్యని ఇలా కూడా చూయించవచ్చని పూరి ప్రూవ్ చేసాక ఇద్దరి అభిమానులతో పాటు మొత్తం ఇండస్ట్రీ ఒక్కసారి పైసా వసూల్ మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు ఎవరికీ ఈ కాంబినేషన్ మీద గానీ, పైసా వసూల్ సినిమా మీద గానీ ఏ సందేహాలు లేవు . ఎలా ఉంటుందో అన్న ఆసక్తి, ఎంత బాగుంటుంది అన్న అంచనా తప్ప. మరికొన్ని గంటల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పైసా వసూల్ హిట్ అయితే పూరి మళ్లీ ట్రాక్ ఎక్కినట్టే. ఇక బాలయ్య స్పీడ్ ఇంకాస్త పెరుతుందనడంలో సందేహం లేదు.

మరిన్ని వార్తలు:

సంక్రాంతికి మెగా పోటీ తప్పేలా లేదు

కుడిభుజాన్ని తెగ్గోసిన పవన్ కళ్యాణ్ ?

అర్జున్‌ రెడ్డి సినిమాను నిలిపేయండి..!