సంక్రాంతికి మెగా పోటీ తప్పేలా లేదు

pawan-kalyan-andram-charanin-sankranthi-festival-movie-rase

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ‘రంగస్థలం’ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ‘రంగస్థలం’ సినిమాతో పాటు మహేష్‌బాబు, కొరటాల శివల ‘భరత్‌ అను నేను’ చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. 

బాబాయి పవన్‌ కళ్యాణ్‌ కోసం రామ్‌ చరణ్‌ కాస్త తగ్గుతాడని అంతా భావించారు. కాని ఇప్పటికే ఆలస్యం అయిన కారణంగా ‘రంగస్థలం’ చిత్రాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని నిర్మాతలు మరియు దర్శకుడు తేల్చి చెబుతున్నారు. దాంతో సంక్రాంతికి బాబాయి, అబ్బాయిల మద్య తీవ్రమైన పోటీ తప్పేలా లేదని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు మెగా హీరోలు ఇంత తక్కువ సమయంలో బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడినది లేదు. మొదటిసారి బాబాయి, అబ్బాయిలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఇదే జరిగితే రెండు సినిమాలకు కూడా నష్టం అని మెగా ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. కనీసం వారం రోజులు అయినా గ్యాప్‌తో ఈ సినిమాలు విడుదల కావాలని మెగా ప్యాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. ఏం జరుగుతుందో ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డి సినిమాను నిలిపేయండి..!

తేజకు మెగా ఆఫర్‌

జాతకం కలవక నిఖిల్ పెళ్లి క్యాన్సిల్?