ఎన్టీఆర్‌ సినిమా.. బాలయ్య కొత్త ప్రకటన

Balayya New Announcement for NTR Biopic Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ఒక సినిమాను తెరకెక్కిస్తాను అంటూ దాదాపు ఆరు నెలల క్రితం మీడియాతో చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటి నుండి గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతూనే ఉందట. కాని మద్యలో బాలకృష్ణ ఆ ప్రాజెక్ట్‌ను వదిలేశాడు అంటూ కొందరు ప్రచారం మొదలు పెట్టారు. బాలయ్య ‘ఎన్టీఆర్‌’ సినిమా గురించి అంతా మర్చి పోతున్న సమయంలో ‘పైసా వసూల్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరోసారి ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. బాలయ్య చేసిన కొత్త ప్రకటనతో మళ్లీ ‘ఎన్టీఆర్‌’ సినిమా గురించి సినీ వర్గాల్లో మరియు నందమూరి ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది.ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించి పనులు జరుగుతున్నాయి, స్క్రిప్ట్‌ వర్క్‌ ముగింపు దశకు చేరుకుంది, రెండు మూడు రోజుల్లోనే దర్శకుడిని ప్రకటిస్తాను అంటూ బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు.

దర్శకుడిపై ప్రకటన చేస్తానంటూ బాలయ్య చెప్పిన నేపథ్యంలో ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘పైసా వసూల్‌’ బాలయ్యకు 101వ చిత్రం కాగా, తన 102వ చిత్రాన్ని తమిళ దర్శకుడు రవికుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత అంటే 103వ చిత్రంగా ఎన్టీఆర్‌ చిత్రం ఉండవచ్చు అనే చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ను ఎలా ఆరంభించారు, ఆ సమయంలో చెన్నైలో ఎన్టీఆర్‌ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనే విషయాలను బాలయ్య టీం తెలుసుకునే పనిలో ఉంది. సినిమాలో బాలయ్య సినీ జీవితాన్ని మాత్రమే ఆవిష్కరిస్తారని సమాచారం. హీరోగా ఎన్టీఆర్‌ జర్నీ ఏంటి, పార్టీ ప్రారంభించి, సీఎం ఎలా అయ్యాడు అనేది క్లైమాక్స్‌లో చూపించి సినిమాను ముగిస్తాడు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డి సినిమాను నిలిపేయండి..!

తేజకు మెగా ఆఫర్‌