పవన్ కి మొదటిసారి కౌంటర్ ఇచ్చిన బాలయ్య…

Balakrishna responses Pawan Kalyan comments Over Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లంతా తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా అంద‌రూ ప‌వ‌న్ వైఖ‌రిని తూర్పార‌బ‌డుతున్నారు. మీడియా కూడా టీడీపీ నాయకులంద‌రినీ ప‌వ‌న్ గురించే ప్ర‌శ్నిస్తోంది. జ‌ర్న‌లిస్టులు అడిగిందే త‌డ‌వుగా… టీడీపీ నేత‌లంతా ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల వాన కురిపిస్తున్నారు. ప‌వ‌న్ ను దుమ్మెత్తిపోసేందుకు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. ప్ర‌భుత్వంపైనే కాకుండా చంద్ర‌బాబు కుటుంబంపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగిన ప‌వ‌న్ ను తిట్ట‌డానికి నేత‌లెవ‌రూ ముందూ వెన‌కా ఆలోచించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో హిందూపురంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన‌ ఎమ్మెల్యే, సినీ న‌టుడు బాల‌కృష్ణ‌ను కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించాల్సిందిగా మీడియా కోరింది. అయితే బాల‌య్య మాత్రం ఇందుకు నిరాక‌రించారు. ఒక‌రిని హీరో చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, తానే సూప‌ర్ హీరో అని బాల‌కృష్ణ వ్యాఖ్యానించారు. హిందూపురంలో రూ.2 కోట్ల రూపాయ‌ల‌తో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ బాల‌య్య ఈ వ్యాఖ్య‌లు చేశారు.