మౌనంగా ఒప్పేసుకున్న నాని!

Nani to Host Bigg Boss telugu Season 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పలు దేశాల్లో బిగ్‌బాస్‌ ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో తెలుగులో కూడా అదే రేంజ్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బిగ్‌బాస్‌ తెలుగు మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రసారం చేయడం జరిగింది. రెండవ సీజన్‌కు కూడా ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం ఉందని మొదట వార్తలు వచ్చాయి. అయితే వరుసగా ఎన్టీఆర్‌ పెద్ద చిత్రాలకు కమిట్‌ అయిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ స్థానంలో నానిని స్టార్‌ మా వారు సంప్రదించినట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయాన్ని నాని వద్ద ప్రస్థావించగా అనధికారికంగా క్లారిటీ ఇచ్చాడు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను నాని హోస్ట్‌ చేయబోతున్నట్లుగా ఆయన మౌనంతోనే చెప్పకనే చెప్పాడు. తాజాగా ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న నానిని కొందరు మీడియా మిత్రులు బిగ్‌బాస్‌ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఎంత అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన నవ్వుతూ మాట దాటేశాడు. బిగ్‌బాస్‌లో ఆయన చేయకుంటే నిర్మొహమాటంగా లేదండీ అంటూ చెప్పేవాడు. కాని నవ్వేశాడు కనుక ఆయన బిగ్‌బాస్‌ చేయబోతున్నట్లుగా భావించవచ్చు అంటూ కొందరు అంటున్నారు. ఒకవేళ నాని బిగ్‌బాస్‌ను చేస్తే ఎన్టీఆర్‌ రేంజ్‌లో ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.