సెన్సార్‌ పూర్తి… విడుదల అయ్యేనా?

vishwaroopam 2 movie censor completed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా దాదాపు అయిదు సంవత్సరాల క్రితం తెరకెక్కిన ‘విశ్వరూపం’ అప్పట్లో వివాదాలతో దాదాపు నెల రోజులు మీడియాలో నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాను తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోవడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో కమల్‌ హాసన్‌ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఏదోలా ఆ చిత్రం విడుదల అయ్యింది. ఆ తర్వాత కమల్‌ సీక్వెల్‌ను చేశాడు. అదే సంవత్సరంలో సీక్వెల్‌ అయిన ‘విశ్వరూపం 2’ను కూడా విడుదల చేస్తామని కమల్‌ చెప్పాడు. అయితే అదే సంవత్సరం అన్న విశ్వరూపం 2 ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు.

పలు కారణాలు చెబుతూ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. తాజాగా కమల్‌ విశ్వరూపం 2పై అభిమానంతో తానే చేతుల్లోకి తీసుకుని విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇటీవలే ఆ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన కమల్‌ తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేయించాడు. తమిళనాడు సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ ను ఇవ్వడం జరిగింది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయినంత మాత్రాన సినిమా విడుదల అయినట్లే అనుకోవద్దని, సినిమా విడుదల చేయడం కమల్‌ చేతిలో లేదని, ఆ చిత్రాన్ని మరో నిర్మాత నిర్మించాడు, ఆయన నుండి పూర్తి అనుమతులు వస్తేనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి విశ్వరూపం 2 సెన్సార్‌ పూర్తి అయిన కూడా విడుదల అవుతుందనే నమ్మకం తమిళ సినీ వర్గాల్లో లేదు. ఒక వేళ విడుదల అయితే తెలుగు మరియు తమిళంలో ఒకే సారి విడుదల చేసే అవకాశాలున్నాయి.