బాలయ్యే రంగంలోకి దిగుతాడేమో?

balakrishna shocking decision on ntr biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర చిత్రం ‘ఎన్టీఆర్‌’కు తాను న్యాయం చేయలేను అంటూ తేజ తప్పుకున్నాడు. తాను ఎన్టీఆర్‌కు గొప్ప అభిమానిని, ఆయన సినిమాకు తాను అభిమానులు ఆశించిన రేంజ్‌లో న్యాయం చేయలేను అంటూ తేజ చెప్పుకొచ్చాడు. తేజ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంను భర్తీ చేసేది ఎవరు అంటూ ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తేజ ఇటీవలే వెంకీతో కూడా ఒక చిత్రం చేయాల్సి ఉండగా క్యాన్సిల్‌ చేసుకోవడం జరిగింది. తాజాగా ఈ చిత్రాన్ని కూడా వదులుకున్న నేపథ్యంలో తేజ తర్వాత సినిమా ఏంటీ అనే విషయంపై చర్చ జరుగుతుంది. మరో వైపు ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం ఎవరు వహిస్తారు, ఎవరి చేతిలో బాలయ్య ఈ చిత్రాన్ని పెడతాడు అనేది ఆసక్తికరంగా మారింది.

బాలకృష్ణకు చాలా కాలంగా దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది. పుష్కర కాలం క్రితమే నర్తనశాల అనే చిత్రాన్ని తన దర్శకత్వంలో చేయాలని భావించాడు. కాని అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత దర్శకత్వం చేయాలని ఉన్నా కూడా ఆ సాహసం చేయలేదు. తాజాగా బాలయ్య మళ్లీ దర్శకత్వ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాఘవేంద్ర రావు మరియు క్రిష్‌ల దర్శకత్వ పర్యవేక్షణలో ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి స్వయంగా బాలయ్య దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. తాను అయితేనే ఎన్టీఆర్‌ స్క్రిప్ట్‌కు న్యాయం చేస్తాను అనేది బాలయ్య విశ్వాసం. అందుకే తేజను బలవంతంగా బాలయ్య స్వయంగా సాగనంపి ఉంటాడు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి బాలయ్య దర్శకుడిగా సక్సెస్‌ అయ్యేనా చూడాలి.