న్యూస్ చానల్స్ కి సినీ ఇండస్ట్రీ కౌంటర్ ఎటాక్ ?

Tollywood Industry to Ban News Channels

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కాస్టింగ్ కౌచ్, ఏమంటూ నటి శ్రీ రెడ్డి ఈ విషయాన్నీ వెలుగులోకి తెచ్చిందో అప్పటి నుండి అటు టాలీవుడ్, ఇటు జనానికి ఇద్దరికీ నిద్ర లేకుండా పోయింది. రోజుకో సెలబ్రిటీ మీద ఆరోపణలు, వారితో చాట్ చేసిన ఆధారాలు చూపిస్తూ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది శ్రీ రెడ్డి. దొరికిందే సందు ఇంకేమీ న్యూస్ లేనట్టు చానళ్ళు అన్నీ దొరికిన కాడికి లైవ్ డిబేట్లు పెట్టి మరీ జనాల్ని చావగొట్టారు. తెలుగులో కొన్ని ఛానళ్ళు అయితే కాస్టింగ్ కౌచ్ అంశం తప్ప ఇంకేమీ లేదు అన్నట్టు 24×7 అదే ప్రసారం చేయడం సినీ పరిశ్రమలోని కొందరు జీర్ణించుకోలేక పోయారు. అదీ కాక పవన్ మీదకి టాపిక్ డైవర్ట్ అవ్వడంతో కొత్తగా పేర్లు బయట పడాల్సిన వారు ఇక మీడియాని ఉపేక్షిస్తే తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక మీడియా మీద విరుచుకుపడడం మొదలెట్టారు.

రాజకీయాలు సినిమాలు రంగాలు వేరయినా కాస్త అటూ ఇటుగా అందులో ఉన్న వారి మనస్తత్వాలు ఒక్కటే. తప్పు చేశావు అంటే… నిజంగా తప్పు అయితే సరిదిద్దుకుంటాను అనడం మానేసి, తప్పు చేసింది నేను ఒక్కడినేనా? నువ్వు చేయాలేదా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇఫ్పుడు పరిశ్రమలోని కొంత మంది పెద్దలు తమ మీద ఇప్పటిదాకా బురద చల్లిన మీడియా చానెళ్ళ మీద ద్రుష్టి సారించాయి అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు ఛానళ్లలోని కొన్నిటిలో కాస్టింగ్ కౌచ్ ఉందని దానిని వెలికి తీసి మా మీద బురద చాల్లే మీడియా కూడా ఆ రోచ్చులోనే ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఛానళ్ళలో మెరుగయిన అవకాశాలు కల్పించే విషయంలో కొన్ని ఛానళ్ళలో కూడా ఇదే నడుస్తోందని సినీ పెద్దలు సమాచారం సేకరించినట్లుగా చెబుతున్నారు. కొన్ని చానల్స్ లో అయితే ఈ కౌచ్ వ్యవహారంలో ఏకంగా యాజమాన్యాలే భాగస్వాములు అయిన సమాచారం కూడా తాము పొందినట్లు పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు అఫ్ ది రికార్డ్ గా అన్నారు. ఎవరెవరి జాతకాలు ఏమిటో తమకు తెలుసని… సినీ పరిశ్రమ కంటే ఎక్కువ అరాచకాలు కొన్ని ఛానళ్లలో జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ అంశాలు అన్నీ కూడా ఆధారాలతో సహా వెలుగులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.

మీడియా వారికీ ఏమో నిన్న మొన్నటిదాకా తోపులు, హీరోలు అనిపించిన వారు ఇప్పుడు జీరోలుగా కనపడుతున్నారు. నిన్న టీవీ 5 బిజినెస్ హెడ్ వసంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా కి సినిమా వాళ్ళకి మరింత దూరం పెంచేవిగా ఉన్నాయి. వసంత్ చేసిన వ్యాఖ్యలు యధాతదంగా “హీరోలు ఇక ఇంటర్వ్యూలు ఇవ్వరట… మంచిదే వాళ్ళ హిపోక్రటిక్ స్టేట్ మెంట్లు. సొంత డబ్బాలతో సాగే ఇంటర్వూలు. నువ్వు నన్ను పొగుడు… నేను నిన్ను పొగుడుతా అన్నట్లు సాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్ల ప్రహసనాలు. మా కుటుంబం గొప్పది అంటే… లేదు మా ఫ్యామిలీ ఇంత గొప్పది అనే వీరావేశంతో వాళ్లు మాట్లాడే సంభాషణలు… ఇవన్నీ ప్రస్తారం చేయాల్సిన బెడద తప్పుతుంది. ప్రేక్షకులకు కూడా వాటిని భరించాల్సిన అగత్యం తగ్గుతుంది. ఇంత మంది నటులు సమావేశం అయితే పరిశ్రమకు సంబంధించిన సాధక, బాధకాలు…ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయిందనే కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలపై మాట్లాడుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆలోచిస్తే బాగుండేది.

నార్మల్ గా ఇలా చేస్తారు మంచి సమాజంలో బతికేవారు అయితే. మమ్మల్ని వేలేత్తిచూపుతున్నారు కాబట్టి వీరిని బహిష్కరిద్దాం అంటూ మూర్ఖంగా తీసుకున్న నిర్ణయాలు.ఇవి వాళ్ల వ్యక్తిత్వ లోపాలను ఎత్తిచూపే అంశం.తెలుగు నటీనటుల్లో ఒక్కరికైనా సామాజిక బాధ్యత ఉన్నట్లు కన్పిస్తుందా? ఒక్క రామ్ గోపాల్ వర్మ, లేకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలా బెటర్ అన్పిస్తోంది. అప్పుడప్పుడు అనాలోచితంగా మాట్లాడినా… వాళ్లు స్పందిస్తారు ఎక్కువసార్లు సమాజంలో జరిగే అంశాలపై వారి బాధ్యతగా మాట్లాడతారు. తమిళ హీరోలు చూడండి. సమయం చూసుకుని సామాజిక అంశాలపై గళమెత్తుతారు. ఉద్యమిస్తారు?. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలను నిలదీసే ప్రయత్నం చేస్తారు.’ అన్తూ ఆయన మాట్లాడం ఈ కింది వీడియో లో చూడచ్చు.

ఈ వ్యవహారం అంతా చూడబోతే షావుకారు షావుకారు కొట్టుకుంటే పాత చింతపండు ధర బయటకి వచ్చిందన్న చందాన అటు మీడియా… ఇటు సినీ పరిశ్రమ మధ్య మరింత గ్యాప్ పెంచేలా కన్పిస్తోంది. వారు వారు కొట్టుకుని వారి వారి లోసుగులని వారే బయట పెట్టుకునేలా ఉన్నారు చూడబోతే.