భరత్‌కు వాతావరణం అనుకూలించడం లేదు

BAN Movie Success Meet Postponed Due to Weather

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం 150 కోట్లు వసూళ్లు చేసిన సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు భారీ ఎత్తున విజయోత్సవ వేడుకను నిర్వహించుకోవాలని నిర్ణయించారు. అందుకోసం తిరుపతి వేదికగా నిర్ణయించారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే నేడో రేపే వేడుక జరగాల్సి ఉంది. కాని వాతావరణం అనుకూలించక పోవడంతో భరత్‌ అనే నేను విజయోత్సవ వేడుకను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

తిరుపతిలో గత మూడు నాలుగు రోజులుగా ఉన్నట్లుండి వర్షం పడుతుంది, మరో వైపు 40 డిగ్రీలకు పైగా ఎండ కొడుతూ ఉక్క పోతతో జనం అల్లాడుతున్నారు. ఈ సమయంలో కార్యక్రమంను నిర్వహించడం వల్ల జరగరానిది ఏమైనా జరిగే అవకాశం ఉందని నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే సినిమా విజయోత్స వేడుక వెన్యూను మార్చే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆడియో వేడుక కూడా వైజాగ్‌ లేదా తిరుపతిలో చేయాలని భావించారు. కాని చివరకు హైదరాబాద్‌లోనే నిర్వహించారు. తాజాగా సక్సెస్‌ వేడుక కూడా చివరకు హైదరాబాద్‌లోనే చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి భరత్‌ అనే నేను కలెక్షన్స్‌ సునామిని అయితే సృష్టించింది కాని, వాతావరణం సరిగా లేని కారణంగా సక్సెస్‌ వేడుక నిర్వహించుకోలేక పోయాడు.