ఎన్టీఆర్ పాత్రలో మోక్షు.. బాలయ్య డిసైడ్ అయినట్టేనా ?

balakrishna son mokshagna entry with NTR Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి అభిమానులకి డబల్ స్వీట్ న్యూస్ ఇది. ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి రెడీ అయిపోయిన బాలయ్య ఆ సినిమాని సొంత బ్యానర్ లో తీయాలి అనుకుంటున్నారట. సొంత బ్యానర్ అంటే రామకృష్ణ సినీ స్టూడియోస్ కాదు. కూతుళ్ళ పేర్లు రెండు కలిసి వచ్చేలా బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అనే సంస్థ ఏర్పాటుకి బాలయ్య డిసైడ్ అయిపోయినట్టు ఆయన సన్నిహితులు కొందరు చెబుతున్న మాట. ఆ బ్యానర్ లో తీసే ఎన్టీఆర్ బయోపిక్ కి తేజ దర్శకుడు అని కూడా ఫిలిం నగర్ టాక్. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే రెడీ అయిపోయిందట.

ఇక ఇంత కన్నా హాట్ అండ్ స్వీట్ న్యూస్ ఏమిటంటే ఎన్టీఆర్ కుర్రోడుగా వున్నప్పటి పాత్రలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కనిపిస్తాడట. వయసు పెరిగిన పాత్ర బాలయ్య చేస్తాడట. ఇలా చేయడం అంటే సాక్షాత్తు తాత ఎన్టీఆర్ పాత్రతో మోక్షు సినీ పరిచయం అవుతుంది. పైగా ఎంతోమందిని యువకుల్ని మంచి నటులుగా తీర్చిదిద్దిన తేజ చేతిలో మోక్షు ని ఉంచడం మంచిదని కూడా బాలయ్య అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం నిజంగా నిజమైతే నందమూరి ఫాన్స్ కి పండగే.