కమల్ సత్తా మీద సొంత అన్నకే నమ్మకం లేదా ?

Charu haasan comments on Kamal Haasan political entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తానంటూ కొత్త పార్టీ ఏర్పాటుకి ఉవ్విళ్లూరుతున్న నటుడు కమల్ హాసన్ కి సొంత ఇంటి నుంచే షాక్ తగిలింది. ఆయన అన్న చారుహాసన్ కమల్ కి సీఎం అయ్యే సత్తా లేదని తేల్చేశారు. నటి సుహాసిని తండ్రి అయిన చారుహాసన్ కాస్త స్థిమితంగా ఆచితూచి మాట్లాడతారని చెప్పుకుంటారు. అలాంటి చారుహాసన్ నోరు తెరిచి కమల్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా సీఎం కాలేడని కుండ బద్దలు కొట్టారు. ఇక సూపర్ స్టార్ రజని కాంత్ అసలు పార్టీ కూడా పెట్టడని చారుహాసన్ అన్నారు. తమిళ రాజకీయాల్ని లోతుగా పరిశీలిస్తున్న వ్యక్తిగా సీఎం అయ్యే శక్తిసామర్ధ్యాలు పీఎంకే నేత అన్బుమణి రాందాస్ కి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తానికి చారుహాసన్ కామెంట్స్ చెన్నైలో హీట్ పుటించాయి. వచ్చే నెల 7 వ తేదీన కొత్త పార్టీ ఏర్పాటుకి కమల్ రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో చారు కామెంట్స్ ఆయన తమ్ముడి ఫాన్స్ కి చిరాకు తెప్పించాయి. అటు రజని కూడా రాజకీయాలపై కీలక నిర్ణయం కోసం హిమాలయాలు వెళ్ళబోతున్నారు. దీంతో ఆయన ఫాన్స్ కూడా తలైవా తుది నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు ఇక అధికారంలో వున్న అన్నాడీఎంకే, విపక్షంలో వున్న డీఎంకే సైతం చారుహాసన్ కామెంట్స్ తో ఉలిక్కిపడ్డాయి. ఒక్క పీఎంకే మాత్రమే చారు స్టేట్ మెంట్ తో హ్యాపీ గా ఫీల్ అయ్యింది.