క‌మ‌ల్ క్యాబినెట్ ఇదే..

Kamal Haasan political party cabinet photo halchal in social media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో అనేక ఫొటోలు, కార్టూన్లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సినిమాల్లో విభిన్న పాత్ర‌లు పోషించి… అంత‌ర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లో ఎలా దూసుకుపోతారా అని ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే క‌మ‌ల్ రాజ‌కీయాల్లో ప్రవేశించిన త‌రువాత త‌మిళ‌నాడు ఇలా ఉంటుందంటూ ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు. వాట‌న్నింటిలో ఓ ఫొటో నెట్ లో విప‌రీతంగా షేర్ అవుతోంది.

తెర‌పై ద‌శావ‌తరాలు ప‌లికించిన క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లో కూడా అన్ని పాత్ర‌లూ తానే పోషిస్తార‌నే అర్దం వ‌చ్చేలా ఉన్న ఈ ఫొటో నెట్ లో న‌వ్వుల పువ్వులు పూయిస్తోంది. క‌మ‌ల్ క్యాబినెట్ ఇలా ఉంటుందంటూ… ఆయ‌న సినిమాల్లో పోషించిన పాత్ర‌ల‌తో ఈ ఫొటో రూపొందించారు. ద‌శావతారంలో పాత్ర‌ల‌తో పాటు భార‌తీయుడు, భామ‌నే స‌త్య‌భామ‌నే, నాయకుడు వంటిచిత్రాల్లో పోషించిన పాత్రల్లో క‌మ‌ల్ క‌నిపిస్తున్నారు. మొత్తానికి త‌న సినిమాల్లానే లోక‌నాయ‌కుడు సొంత పార్టీని కూడా అన్నీ తానై న‌డిపిస్తారని సినిమా వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.