‘రాజా ది గ్రేట్‌’లో మెగాహీరో?

Sai Dharam Tej Guest Role Appearance In Ravi Teja Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాస్‌ రాజా రవితేజ హీరోగా అనీల్‌రావిపూడి దర్శకత్వంలో మెహ్రీన్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను అనీల్‌ రావిపూడి ఫుల్‌ మాస్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో రాశిఖన్నా ఐటెం సాంగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. అనీల్‌ రావిపూడిపై అభిమానంతో ఈ సినిమాలో రాశిఖన్నా ఐటెం సాంగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. అదే విధంగా సాయి ధరమ్‌ తేజ్‌ కూడా అనీల్‌పై అభిమానంతో ఐటెం సాంగ్‌లో మెరబోతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం షూటింగ్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ పాల్గొనడంతో పాటు రెండు స్టెప్పులు కూడా వేశాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దాంతో రాజా ది గ్రేట్‌ చిత్రం ఐటెం సాంగ్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుప్రీమ్‌’ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ మరియు రాశిఖన్నాలు నటించారు. ఆ సినిమా ఇద్దరికి మంచి పేరును తెచ్చి పెట్టింది. అందుకే ఇప్పుడు అనీల్‌ రావిపూడి కోసం ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో ఐటెం సాంగ్‌లో వీరిద్దరు మెరబోతున్నట్లుగా తెలుస్తోంది.