‘రాజా ది గ్రేట్‌’పై అనుమానాలు… కారణం బ్యాడ్‌ సెంటిమెంట్‌

Ravi Teja Raja The Great Movie Release On Diwali

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మాస్‌ మహారాజ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ‘రాజ ది గ్రేట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. వరుస విజయాలు దక్కించుకుంటున్న దర్శకుడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాత దిల్‌రాజు నిర్మించడం జరిగింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను దీపావళి సందర్బంగా అక్టోబర్‌ 19న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. రవితేజ పూర్తి స్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌తో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అనిపిస్తుంది.

అంధుడిగా రవితేజ మొదటి సారి నటించి మెప్పించబోతున్నాడు. ట్రైలర్‌ చూస్తుంటే రవితేజ ఖచ్చితంగా ఫ్యాన్స్‌ను మరియు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది. కాని ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌ మాత్రం సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌ కారణంగా సినిమా ఫ్లాప్‌ అయ్యే అవకాశాలున్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. సాదారణంగా దీపావళికి తెలుగు సినిమాలు పెద్దగా విడుదల కావు. ముఖ్యంగా పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలను దీపావళి సందర్బంగా విడుదల చేయరు. కాని ఈ సినిమాను మాత్రం దీపావళి రోజు విడుదల చేస్తున్నారు. ఆ కారణంగా ఈ సినిమా ఫలితం తారు మారు అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.

‘సుప్రీం’ చిత్రంతో మాస్‌ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్న అనీల్‌ రావిపూడి ఈ సినిమాతో మరోసారి సక్సెస్‌ అవుతాడని అంతా అనుకుంటున్నారు. ఇటీవల దిల్‌రాజు నిర్మించిన వరుస సినిమాలు కమర్షియల్‌గా సూపర్‌ హిట్‌ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా కూడా దిల్‌రాజుకు లాభాలను తెచ్చి పెడుతుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.