నేష‌న‌ల్ గానూ  బాల‌కృష్ణ బ‌ద‌నాం…

Balakrishna video buzzed in Social media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అసిస్టెంట్ పై చేయి చేసుకుని వీడియోలో అడ్డంగా బుక్క‌యిన బాల‌కృష్ణ‌నూ సోష‌ల్ మీడియా, స్థానిక చాన‌ళ్లే కాదు. నేష‌న‌ల్ మీడియా కూడా వ‌ద‌ల‌టం లేదు. బాల‌కృష్ణ‌కు వ్య‌తిరేకంగా నేష‌న‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. బాల‌కృష్ణ గ‌తంలో స్టేజీపై అంద‌రిముందు అమ్మాయిల‌పై చేసిన కామెంట్ల‌ను,  సెల్ఫీ దిగ‌టానికి వ‌చ్చిన అభిమానితో బాల‌య్య ప్ర‌వ‌ర్తించిన తీరూ…తాజా ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ ఓ నేష‌న‌ల్ చాన‌ల్ ఒక స్టోరీ ప్ర‌సారం చేసింది.

టాలీవు్డ్ లో అగ్ర‌హీరో కావ‌టంతో పాటు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ బాధ్య‌తగ‌ల వ్య‌క్తిగా ఉండ‌కుండా ఇలా చీటికీ మాటికీ ఎవ‌రో ఒక‌రిపై చేయి చేసుకోవ‌టం, ఏదో ఒక‌టి మాట్లాడ‌టం స‌రైన‌ది కాదని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాల‌కృష్ణ ప్ర‌వ‌ర్త‌న‌పై ఆయ‌న అభిమానుల్లోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. తాజా ఘ‌ట‌న త‌రువాత బాల‌కృష్ణ‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న అభిమాని ఒక‌రు రాసిన లేఖ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రెండు గ్రాముల సంస్కారం కావాల‌న్నా అంటూ ఆ అభిమాని రాసిన లేఖ బాల‌య్య వైఖ‌రిపై ఆయ‌న ఫ్యాన్స్ లోనే ఉన్న ధ‌ర్మాగ్ర‌హాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించింది. దొర‌లు, రాజుల కాలం పోయిందని, ఇది ప్ర‌జాస్వామ్య‌మ‌ని, ప్రేక్ష‌కుల టికెట్ డ‌బ్బుల మీద బతికే మీరు దొర‌ల్లా ఫీల్ అవ‌కూడ‌ద‌ని ఆ అభిమాని త‌న లేఖ‌లో బాల‌కృష్ణ‌కు హిత‌వు ప‌లికాడు. మీ సినిమాల‌ను ప్రేక్ష‌కులు బ‌హిష్క‌రిస్తే వీఐపీలో ఒక అక్ష‌రం మిస్స‌వుతుంద‌ని తీవ్ర హెచ్చ‌రిక కూడా చేశాడు. సినీ ప్ర‌ముఖులు కొంద‌రు త‌మ‌ను తాము దైవాంశ సంభూతులుగా భావించుకుంటూ త‌మ కింద ప‌నిచేసే సిబ్బందిని, ఉద్యోగుల‌ను అనేక ర‌కాలుగా అవ‌మానిస్తుంటారు.

గ‌తంలో అయితే ఇలాంటివి బ‌య‌టికి వ‌చ్చేవి కాదుకాని ఇప్పుడు సోష‌ల్ మీడియా పుణ్యమాని తెర వెనుక హీరోల అస‌లు రూపం బ‌య‌టికి వ‌చ్చేస్తోంది. గ‌తంలో ఓ అభిమానిని చిరంజీవి కొట్టిన ఘ‌ట‌నా ఇలానే సోష‌ల్ మీడియ‌లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టికైనా హీరోలు త‌మ‌ ప్ర‌వ‌ర్త‌న మార్చుకుని హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని తెలుగు సినిమా ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు.