ఇప్ప‌ట్లో పెళ్లి ప్ర‌స‌క్తే లేదు

Prabhas Wedding Is Not Soon

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Prabhas Wedding Is Not Soon

ప్ర‌భాస్‌…ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు. బాలీవుడ్ లోనూ సంచ‌ల‌న‌మే. బాహుబ‌లి 1,2  రికార్డు విజ‌యాల త‌రువాత ప్ర‌భాస్ గురించి దేశ‌మంతా మాట్లాడుకున్నారు. సినిమా సక్సెస్ తో పాటు అంద‌రూ చ‌ర్చించుకుంది ప్ర‌భాస్ పెళ్లి గురించే. పౌరాణిక పాత్ర‌తో ఎంద‌రో అమ్మాయిల క‌ల‌ల రాకుమారిడిగా మారిన ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎవ‌రిని పెళ్లిచేసుకుంటాడు అనేది అంద‌రికీ ఆస‌క్తిగా మారింది. బాహుబ‌లి స‌క్సెస్ మీట్ ల‌లోనూ ప్ర‌భాస్ ను అంద‌రూ పెళ్లి గురించే ప్ర‌శ్నించారు.

బాహుబ‌లి హీరోయిన్ అనుష్క‌నే నిజ‌జీవితంలోనూ ప్ర‌భాస్ జీవిత భాగ‌స్వామి అన్న పుకార్లూ జోరుగా షికారు చేశాయి. త్వ‌ర‌లోనే వాళ్లిద్ద‌రూ పెళ్లిచేసుకుంటార‌న్న వార్త‌లూ వినిపించాయి. కానీ వీటిపై ఎప్పుడూ ప్ర‌భాస్ స్పందించ‌లేదు. దీంతో ఆ పుకారు ఆగిపోయి మ‌రెవ‌రితోనే ప్ర‌భాస్ పెళ్లి ఫిక్స్ అయింద‌ని, పెళ్లి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో వార్తలు వినిపించాయి. వాట‌న్నింటినీ తోసిపుచ్చుతూ తొలిసారి ప్ర‌భాస్ త‌న పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి సంబంధించి ఇప్ప‌టిదాకా తాను ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని, త‌న ఇంట్లో పెళ్లి ముచ్చ‌ట్లు జ‌రుగుతున్నాయ‌న్న మాటా నిజం కాద‌ని బాహుబ‌లి స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా సాహో సినిమాపైనే ఉంద‌ని , ఆ సినిమా విడుద‌ల త‌ర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాన‌ని తెలిపారు. ప‌నిలో ప‌నిగా అనుష్క‌తో పెళ్లంటూ వ‌చ్చిన వార్త‌ల‌పైనా ప్ర‌భాస్ స్పందించారు. ఒక హీరో, హీరోయిన్ రెండు, మూడు సినిమాల్లో క‌లిసి న‌టిస్తే ఇలాంటి పుకార్లు రావ‌టం స‌హ‌జ‌మేన‌ని, ఇలాంటి వార్త‌లు మొద‌ట్లో త‌న‌కు ఇబ్బంది క‌లిగించినా…త‌ర్వాత వాటి గురించి ప‌ట్టించుకోవ‌టం మానేశాన‌ని తెలియ‌జేశారు. బాలీవుడ్ లో త‌న‌కు ఎంత క్రేజ్ పెరిగినా టాలీవుడ్ ను మాత్రం వీడేది లేద‌ని ప్ర‌భాస్ స్ప‌ష్టంచేశారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమాపై  దేశవ్యాప్తంగా భారీ అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమాను తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. యు.వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉప్ప‌లపాటి ప్ర‌మోద్‌, వంశీకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ విల‌న్ గా న‌టిస్తున్నారు. శంక‌ర్‌, ఎహ‌సాన్ లాయ్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ ప్రారంభమ‌యినా…హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా పూర్తికాలేదు.