సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్‌

Pawan Kalyan Movie To Release In Sankranthi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 Pawan Kalyan Movie To Release In Sankranthi

ప‌వ‌న్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖ‌రార‌యింది. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయ‌లేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి 10 లేదా ప‌ద‌కొండో తేదీన సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. సంక్రాంతి హీరోగా ప‌వ‌న్ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.  అత్తారింటికి దారేది లాంటి భారీ విజ‌యం త‌రువాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ , ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమా కావ‌టంతో పాటు, ఇది ప‌వ‌న్ 25వ సినిమా కావ‌టంతో  ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి.

దానికి త‌గ్గ‌ట్టుగానే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జ‌రిగింది. అయితే షూటింగ్ మొద‌లై చాలా రోజులే గ‌డుస్తున్నా సినిమాకు సంబంధించి ఇంత‌వ‌ర‌కూ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కాక‌పోవ‌టం, టైటిల్ ఫిక్స్ చేయ‌క‌పోవ‌టంపై ప‌వ‌న్ అభిమానుల్లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న చిత్ర యూనిట్ స్వాతంత్ర్యం దినోత్స‌వ  కానుక‌గా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తామ‌ని ప్రక‌టించింది. ఆ లోపే చిత్రం టైటిల్ నూ ఖ‌రారు చేయాల‌ని భావిస్తోంది, ఇంజ‌నీర్ బాబు, ప‌ర‌దేశ ప్ర‌యాణం, గోకుల కృష్ణుడు వంటి టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.  చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ జంట‌గా న‌టిస్తున్నారు.

త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ కాంబినేష‌న్లో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మ్యూజిక‌ల్ గానూ సెన్సెష‌న‌ల్ హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమానూ మ్యూజిక‌ల్ హిట్ చేయాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నారు. అటు సంక్రాంతి అంటేనే సినిమాల సీజ‌న్‌. అనేక‌మంది హీరోల సినిమాలు పోటాపోటీగా సంక్రాంతికి రిలీజ‌వుతుంటాయి. వ‌చ్చే సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచే రెండు సినిమాలు రానున్నాయి. రామ్ చ‌ర‌ణ్ తేజ న‌టిస్తున్న రంగ స్థ‌లం, వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలూ సంక్రాంతికే ఉంటాయ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రి ప‌వ‌న్ కళ్యాణ్ కు, మెగా హీరోలకూ మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తున్న ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం మెగా హీరోలు త‌ప్పుకుంటారా లేక పోటాపోటీకే సిద్ధ‌మ‌వుతారా అన్న‌ది వేచి చూడాల్సిందే…