విజ‌య్ కు నో చెప్పిన ర‌కుల్‌

Rakul Rejected Vijay

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Rakul Rejected Vijay

టాలీవుడ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతే కోలీవుడ్ లోనూ రెండు  ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులు ఒప్పుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణ‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. స్పైడ‌ర్ త‌రువాత మురుగుదాస్ త‌మిళంలో విజ‌య్ తో ఓ సినిమాను చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో న‌టించేందుకు ముందుగా స‌మంత‌ను సంప్ర‌దించారు.

అయితే పెళ్లి ప‌నుల‌తోనూ, ఇత‌ర ప్రాజెక్టుల‌తోనూ బిజీగా  ఉన్న స‌మంత  ఈ అవ‌కాశాన్ని తిర‌స్క‌రించింది. వెంట‌నే మురుగుదాస్ స్పైడ‌ర్ సినిమా హీరోయిన్ అయిన ర‌కుల్ ప్రీత్ సింగ్ కు అవ‌కాశ‌మిచ్చారు. మొద‌ట ఈ సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించిన  ర‌కుల్ త‌ర్వాత నో  చెప్పింద‌ట‌. స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ర‌కుల్ విజ‌య్ సినిమాలో న‌టించ‌న‌న‌టానికి కార‌ణ‌మేమిటో కోలీవుడ్ వ‌ర్గాల‌కు అర్ధం కావ‌టం లేదు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ న‌టిస్తుండ‌టంతో డేట్లు ఎడ్జ‌స్ట్ చేయ‌లేకే ర‌కుల్ ఈ సినిమాకు నో చెప్పింద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే వ‌ర‌స ఫ్లాపులు ఎదుర్కొంటున్న విజ‌య్ తో క‌లిసి న‌టించ‌టం ఇష్టం లేకే ర కుల్  ఈ చిత్రం చేయ‌టం లేద‌ని కొంద‌రు భావిస్తున్నారు. త‌మిళంలో ఇప్పుడిప్పుడే కెరీర్ నిల‌దొక్కుకుంటున్న త‌రుణంలో ఫ్లాపులు ఎదుర‌యితే ఐరెన్ లెగ్ అన్న ముద్ర ప‌డుతుంద‌న్న భ‌యంతోనే మందు జాగ్ర‌త్త‌గా ర‌కుల్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ర‌కుల్ కు ఎంత ముందు జాగ్ర‌త్తో క‌దా…