వ్యాపార రంగంలో స‌మంత‌

Samantha Into Business

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Samantha Into Business

హీరోయిన్లు ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వ్యాపార‌వేత్తల‌గానూ కొత్త అవ‌తార‌మెత్తుతున్నారు. త‌మ‌న్నా, కాజ‌ల్‌ జ్యుయెల‌రీ బిజినెస్ లోనూ, ర‌కుల్ ప్రీత్ సింగ్ జిమ్ బిజినెస్ లోనూ స‌త్తాచాటుతున్నారు. వారి బాట‌లో్నే మ‌రో స్టార్ హీరోయిన్ కూడా వ్యాపార‌వేత్త‌గా మార‌నున్నారు.  అటు సినిమాల‌తోనూ, ఇటు పెళ్లి ప‌నుల‌తోనూ బిజీగా ఉన్న స‌మంత త్వ‌ర‌లోనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఎస్‌వీఎస్ పార్ట‌న‌ర్స్ ఎల్ఎల్‌పీ అనే కంపెనీని స్థాపించాన‌ని ట్డిట్ట‌ర్ ద్వారా ప్ర‌కటించారు స‌మంత‌. 

ఈ కంపెనీ కోసం ఎన్నో  క‌ల‌లు కంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే ఆ క‌ల‌లు సాకారం చేసుకుంటాన‌ని అన్నారు స‌మంత‌. అయితే కంపెనీకి సంబంధించిన ఇత‌ర వివ‌రాలేవీ స‌మంత వెల్ల‌డించ‌లేదు. ప్ర‌స్తుతం స‌మంత రాజుగారి గ‌ది 2, రంగ‌స్థ‌లం సినిమాల్లో న‌టిస్తున్నారు. అక్టోబ‌రు ఆరున నాగ‌చైత‌న్య‌తో స‌మంత వివాహం జ‌ర‌గ‌నుంది. ఆ లోపే కొత్త కంపెనీ ప్రారంభిస్తారా లేక పెళ్లి త‌రువాత వ్యాపారంలో అడుగుపెడ‌తారా అన్న‌ది స‌మంత వెల్ల‌డించ‌లేదు.