ప్రభాస్‌ పెళ్లి కోసం ఆయన చెల్లెల్ల ఆరాటం

Sisters Big Plans for Prabhas Marriage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రభాస్‌ పెళ్లి  గురించి గత మూడు నాలుగు సంవత్సరాలుగా మీడియాలో తారా స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో వార్తలు ప్రభాస్‌ పెళ్లి గురించి వచ్చాయి. ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు పూర్తి అవ్వడమే ఆలస్యం ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడని కొన్ని రోజులు ప్రచారం జరిగింది, ఆ తర్వాత ప్రభాస్‌ ‘బాహుబలి 2’ చిత్రం విడుదలైన తర్వాత పెళ్లి చేసుకుంటాడట అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ‘సాహో’ చిత్రాన్ని పూర్తి చేసి పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రభాస్‌ సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నేడు రాఖీ పండుగ సందర్బంగా ఆయన చెల్లెల్లు అయిన కృష్ణంరాజు ముగ్గురు కూతుర్లు ప్రభాస్‌కు రాఖీ కట్టి పండుగ జరుపుకున్నారు. 

ఈ సందర్బంగా ప్రభాస్‌ చెల్లి సాయి ప్రదీప్తి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కూడా అన్నయ్యకు రాఖీ కట్టడం జరుగుతుంది. రాఖీ కట్టిన తర్వాత మా ముగ్గురికి కూడా సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌లను అన్నయ్య మాకు ఇస్తాడు. మేం ఏమడిగినా కాదనకుండా మాకోసం తెస్తాడు. అలాంటి అన్నయ్యను చాలా కాలంగా పెళ్లి ఎప్పుడు అంటూ అడుగుతూనే ఉన్నాం. కాని అన్నయ్య మాత్రం ఆ విషయానికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వస్తున్నాడు. అన్నయ్య పెళ్లి గురించి చాలా డ్రీమ్స్‌ ఉన్నాయి. సంగీత్‌లో డాన్స్‌ వేసేందుకు ఇప్పటికే నేర్చేసుకున్నాం, డ్రస్‌ల నుండి అన్ని కూడా అన్నయ్య పెళ్లికి భారీగా షాపింగ్‌ చేయాలని కోరిక, ఇక అన్నయ్య పెళ్లిలో సందడి చేయాలని కోరికగా ఉంది. కాని అన్నయ్య మాత్రం ఆ కోరికను తీర్చకుండా దాటవేస్తూ వస్తున్నాడు. ఎప్పటికి అన్నయ్య పెళ్లి చేసుకుంటాడో అని అభిమానులతో పాటు మేము కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ చెప్పుకొచ్చిది.

మరిన్ని వార్తలు:

సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్‌

విజ‌య్ కు నో చెప్పిన ర‌కుల్‌