అప్పుడు తండ్రి-ఇప్పుడు కొడుకు     

Ys jagan and Ys Rajasekhar reddy controversy comments on Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

                                                                                                                                    ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు మొత్తం నంద్యాల ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి.  అయితే టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేత‌లు ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు గుప్పించుకుంటుంది ఉప ఎన్నిక పైన కాదు… స్థానిక అంశాల మీద అంత‌క‌న్నా కాదు. నంద్యాల‌ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనే ఇప్పుడు రెండు పార్టీల్లోనూ విస్తృత స్థాయి చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ మాట‌కొస్తే పార్టీల్లోనే కాదు… సామాన్య ప్ర‌జ‌లూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల గురించి చ‌ర్చించుకుంటున్నారు. ఆవేశంలో అనాలోచితంగా అన్నారో లేక ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహం ప్ర‌కారం కావాల‌నే అన్నారో తెలియ‌దు కానీ…జ‌గ‌న్ మాత్రం స‌భ‌కు వ‌చ్చిన వేల‌మంది జ‌నం సాక్షిగా, మీడియా మైకులు, ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల సాక్షిగా చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చిచంపినా త‌ప్పులేదు అన్నారు. జ‌గ‌న్ ఆ మాట అన్న మ‌రుక్ష‌ణం నుంచే ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త గ్రాఫ్ వేగంగా పెరిగిపోయింది.

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌తో టీడీపీ వారే కాదు… వైసీపీ శ్రేణులూ షాక్ తిన్నాయి. బ‌హిరంగంగా జ‌గ‌న్ అలా మాట్లాడ‌టం వైసీపీ నేత‌ల‌నూ ఇర‌కాటంలో ప‌డేసింది. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు చేస్తే అధికార ప‌క్షం ఎదురుదాడికి దిగ‌టం స‌హ‌జం. జ‌గ‌న్ మాట‌లపై సామాన్య జ‌నంలో నూ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని అర్ధ‌మ‌వ‌టంతో టీడీపీ ఇక ఆ విష‌యాన్ని మ‌రింత సీరియ‌స్ గా తీసుకుని జ‌గ‌న్ నైజాన్ని ఎండ‌గ‌డుతోంది. నంద్యాల స‌భ త‌రువాత జ‌గ‌న్ ఎటువంటి వారో, ఆయ‌న వైఖ‌రి ఎలా ఉంటుందో ప్ర‌జ‌లు అర్ధం చేసుకున్నార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. జ‌గ‌న్ నేరస్థుడు, ఫ్యాక్ష‌నిస్ట్ , హింసాప్ర‌వృత్తి క‌ల‌వాడు కాబ‌ట్టే ఆయ‌న నోటి నుంచి ఇలాంటి మాట‌లు వ‌చ్చాయ‌ని, ఇటువంటి వాళ్లు రాజ‌కీయాల‌కు త‌గ‌ర‌ని వారు. విమ‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా రాష్ట్రంలోని అనేక చోట్ల ఆయ‌న దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేశారు. ఇన్నేళ్ల నుంచి రాజ‌కీయాల్లో ఉంటున్న చంద్ర‌బాబు అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ఎప్పుడూ హుందాగానే వ్య‌వ‌హ‌రిస్తార‌ని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిపైనా ఆయ‌న ఎప్పుడూ ఇలాంటి విమ‌ర్శ‌లు చేయ‌లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. జ‌గ‌న్ లానే ఓసారి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కూడా అసెంబ్లీలో చంద్ర‌బాబును ఉద్దేశించి మీ త‌ల్లి కడుపున ఎందుకు పుట్టాను అని నువ్వు ఏడ్చేలా చేస్తాను చంద్ర‌బాబు అని విమ‌ర్శించారు. దీనిపై అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే రేగింది. వైఎస్ వ్యాఖ్య‌ల‌ను అనేక‌మంది త‌ప్పుబ‌ట్టారు. అయినా స‌రే అసెంబ్లీ సాక్షిగా  చేసిన ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోటానికి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఒప్పుకోలేదు.

జ‌గ‌న్ కూడా  ఇప్పుడు తండ్రి బాట‌లోనే ప‌య‌నిస్తూ…ఉచితానుచితాలు మ‌ర‌చి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. తాజా ఘ‌ట‌న త‌రువాత అయినా జ‌గ‌న్ త‌న వైఖ‌రిమార్చుకోవాల‌ని టీడీపీ నేత‌లు సూచిస్తున్నారు. టీడీపీలోనే కాదు…వైసీపీలోనూ జ‌గ‌న్ మాట‌ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. జ‌గ‌న్ త‌న ఆవేశ‌పూరిత వ్యాఖ్య‌ల‌తో నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీకి లాభం చేకూర్చార‌ని   వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డు అంగీక‌రిస్తున్నారు. నంద్యాల స‌భ‌లోనూ, అంత‌కుముందు  జ‌గ‌న్ అనేక నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేశార‌ని, ఈ ఒక్క వ్యాఖ్య‌తో అవ‌న్నీ తుడిచిపెట్టుకుపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. అయితే త‌మ నాయ‌కుడి మాట‌లు త‌ప్ప‌ని వైసీపీ శ్రేణులు బ‌హిరంగంగా అంగీక‌రించ‌క‌పోయినా…ఆయ‌న ప‌త్రిక సాక్షి, కొన్ని వైసీపీ అను కూల వెబ్ సైట్లు    మాత్రం  ఒప్పుకుంటున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఎన్నో వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపినా… వాట‌న్నింటికీ స‌మాధానం ఇవ్వ‌లేని టీడీపీ ఈ ఒక్క అంశాన్ని ప‌ట్టుకుని రాద్దాంతం చేస్తున్నాయి అంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య త‌ప్పే అని ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా అంగీక‌రిస్తూ కొన్ని సైట్ల‌లో వార్త‌లు రాస్తున్నారు. ఇది జ‌గ‌న్ ను మ‌రింత ఇర‌కాటంలో పెడుతోంది. అటు ఈ వ్యాఖ్య‌ల వ‌ల్ల జ‌గ‌న్ కు న‌ష్టం జరిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంగీక‌రిస్తున్నారు. ఓ రాష్ట్ర  ముఖ్య‌మంత్రిని రోడ్డు మీద కాల్చి చంపినా త‌ప్పులేదు అన‌టం జ‌గ‌న్ లోని రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని వారు అంటున్నారు.  రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు ఉన్న స‌రిహ‌ద్దు రేఖ‌ను త‌న వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ చెరిపివేశార‌ని ఆక్షేపిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర రాజ‌కీయాల్ర‌లో జ‌గ‌న్  వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. నంద్యా ల ఉప ఎన్నిక ముగిసేదాకా ఈ వేడి ఇలాగే కొన‌సాగుతుంది.

మరిన్ని వార్తలు:

పవన్ కి రోజా డోలు…జయప్రకాశ్ సన్నాయి.

మన ఎంపీలు ఈ స్థితిలో ఉన్నారా..?

కేసీఆర్ కు దత్తన్న ఆన్సర్ కామెడీ