పవన్ కి రోజా డోలు…జయప్రకాశ్ సన్నాయి.

roja fires on pawan kalyan and jayaprakash narayana praise to pawan kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ తీరుతెన్నుల మీద భిన్నాభిప్రాయాలు ఎదురు అవుతున్నాయి. ఓ వైపు ఆయన మీద ప్రశంసలు కురుస్తుంటే ఇంకోవైపు విమర్శలు తప్పడం లేదు. మంగళగిరి చేనేత సభలో పవన్ కళ్యాణ్ వైఖరిని తూర్పారబడుతూ డోలు వాయించేసింది. కాటమరాయుడు సినిమా టైం లో కాటన్ రాయుడు లా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేనేత కార్మికులు ఎన్ని కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదని రోజా తిట్ల దండకం అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కార్ ఎన్ని తప్పులు చేస్తున్నా ఏమీ అడగకుండా గోడ మీద పిల్లలా వ్యవహరిస్తున్నాడని పవన్ ని ఏకిపారేశారు రోజా.

అయితే అదే సమయంలో లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ మాత్రం ప్రజాస్వామ్య దేశానికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అవసరమని చెప్పారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి పవన్ తీసుకున్న చొరవ, చేసిన శ్రమ ప్రజాస్వామ్య యుతంగా ఉందని జయప్రకాశ్ వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడులో ఆయన పవన్ మీద ప్రశంసలు కురిపించారు. పవన్ లాంటి నాయకుడిని అందరూ ఆహ్వానించాలని జయప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ఓ రకంగా చూస్తే ఎన్టీఆర్ ని పొగిడే జయప్రకాశ్ ఆ తరువాత ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించింది పవన్ కళ్యాణ్ మీదే.

మరిన్ని వార్తలు:

మన ఎంపీలు ఈ స్థితిలో ఉన్నారా..?

కేసీఆర్ కు దత్తన్న ఆన్సర్ కామెడీ

ఒక్క మాట.. రివర్స్ అయింది