గ్రాండ్ సక్సెస్ మీట్ కి రెడీ అవుతోన్న ‘భగవంత్ కేసరి’ టీమ్ ?

గ్రాండ్ సక్సెస్ మీట్ కి రెడీ అవుతోన్న ‘భగవంత్ కేసరి’ టీమ్ ?
Cinema News

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా భగవంత్ కేసరి. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా లో పవర్ఫుల్ రోల్ లో బాలకృష్ణ మరొక్కసారి తన యాక్టింగ్ తో అదరగొట్టగా అనిల్ రావిపూడి తన స్టైల్ టేకింగ్ తో ఆకట్టుకున్నారు.

గ్రాండ్ సక్సెస్ మీట్ కి రెడీ అవుతోన్న ‘భగవంత్ కేసరి’ టీమ్ ?
Bhagavanth Kesari

ఇప్పటికే మూడవ వారంలోకి అడుగుపెట్టిన భగవంత్ కేసరి ఇంకా చాలా ప్రాంతాల్లో మంచి కలెక్షన్ అందుకుంటూ ఉండడం విశేషం. అయితే మ్యాటర్ ఏమిటి అంటే , తమకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకాభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేందుకు నవంబర్ 9న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించేందుకు భగవంత్ కేసరి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది . అలానే అతి త్వరలో దీనికి సంబంధించి వారి నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. థమన్ సంగీతం అందించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితం అయింది.