తమిళనాట మెగా రికార్డ్ కు భరత్ ఎసరు

Bharat Ane Nenu beats Rangasthalam at Tamilnadu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా పవర్ స్టార్ నటించి, ఇటివలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి తెలుగు చిత్ర జాబితాలలో మూడవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమా రిలీజైన అన్ని ప్రాంతాలలో అధిక మొత్తంలో వసూళ్లు సాధించగా చెన్నై లో మొదటి రోజు దాదాపు 25 లక్షలు వసూలు చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సమంత కథానాయకిగా నటించింది.

తాజాగా మహేష్ నటించిన భరత్ అనే నేను నిన్న రిలిజై మంచి టాక్ తెచ్చుకుంటుంది.ఈ సినిమా రంగస్థలం సినిమాని క్రాస్ చేసి మొదటి రోజు చెన్నై లో సుమారు 27 లక్షలకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి తెలుగు చిత్రాలలో మొదటి జాబితాలలో చేరింది.మొదటి రోజు అధిక మొత్తంలో కలెక్ట్ చేసి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిచాడు.శివ కొరటాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మించాడు.బాలివుడ్ నటి కైరా అద్వాని కథానాయకిగా నటించిన ఈ సినిమాలో మహేష్ ముఖ్య మంత్రిగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.