రంగస్థలం రికార్డు మూనాళ్ల ముచ్చటేనా?

Bharat Ane Nenu Movie breaks rangasthalam movie record

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం దిశగా దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దుమ్ము దుమ్ముగా వసూళ్లు సాధించింది. ఇక సుకుమార్‌ ప్రతి సినిమా కూడా ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను రాబడతాయి. అలాగే ఈ చిత్రం కూడా ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. 3.1 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసి నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. టాప్‌ 3లో స్థానం దక్కించుకున్న ఈ చిత్ర రికార్డు మూనాళ్ల ముచ్చటే అంటూ ట్రేడ్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘రంగస్థలం’ కేవలం 10 రోజుల్లో ఏకంగా 3 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ రికార్డును భరత్‌ అనే నేను సునాయాసంగా బీట్‌ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మహేష్‌బాబుకు సహజంగానే ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ కారణంగా ఏకంగా 2000 ప్రీమియర్‌ షోలను వేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రీమియర్‌ షోలతో పాటు అత్యధిక స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ సన్నాహకాలు చేయడం జరిగింది. ఈ కారణంగానే ఓవర్సీస్‌లో రంగస్థలం రికార్డును మహేష్‌ ‘భరత్‌ అనే నేను’ సునాయాసంగా బీట్‌ చేస్తాడని నమ్ముతున్నారు. అందుకే రంగస్థలం దక్కించుకున్న మూడవ స్థానం కేవలం మూడు నాళ్ల ముచ్చటే అంటూ మహేష్‌ అభిమానులు అంటున్నారు.