భరత్ అనే నేను ” బడ్జెట్ పై అసెంబ్లీ ” అన్ కట్ సీన్ చూసారా …

Bharat Ane Nenu Assembly Uncut Scene

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భరత్‌ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్‌ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ షో లతో రన్‌ అవుతోంది. భరత్ అనే నేను మూవీ కలెక్షన్ల పరంగా మహేశ్ బాబు కెరీర్లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.  తాజాగా సూపర్‌ స్టార్ అభిమానుల కోసం చిత్రయూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఎలాంటి ఎనౌన్స్‌మెంట్‌ లేకుండానే సినిమాలో లేని నాలుగు వీడియో క్లిప్‌లను రిలీజ్‌ చేశారు.
నిడివి కారణంగా సినిమాలో తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్‌ లో రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. అసెంబ్లీలో బడ్జెట్‌కు సంబంధించిన డిస‍్కషన్‌తో పాటు మరో మూడు సన్నివేశాలను చిత్రయూనిట్‌ రిలీజ్ చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి కాని ఈ సన్నివేశాలు ఈ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ సీన్ కాస్త సాగదీసినట్టు ఉన్నప్పటికీ.. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకు ఆలస్యమైందో మహేశ్ ఇచ్చే వివరణ మాత్రం ఆకట్టుకుంటుంది.