పవన్ ఇప్పటికయినా నోరు విప్పుతాడా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ జన్సేన అధ్యక్ష్యుడు పవన్ మధ్య ట్విట్టర్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మీద తన మాటల దాడిని కంటిన్యూ చేస్తున్నారు ఎంపీ గల్లా జయదేవ్. పవన్.. తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు జయదేవ్. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. వ్యక్తిగత విమర్శల దాడి జరిగిందని ఆరోపిస్తూ.. మీరు మీడియాపై దాడికి దిగారని, మీ అభిమానులు పర్సనల్‌గా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు భాష వాడుతున్నారని, శరీరాకృతి, తన కుటుంబసభ్యులను ప్రస్తావిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో మీరు మీ అభిమానులను నియంత్రించే ఉద్దేశంలో ఉన్నట్టుగా తనకు కనిపించడంలేదని, మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా వుందని అన్నారు. దీంతో ఇటు గల్లా, అటు పవన్ అభిమానులు ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరొకరు అస్త్రాలు సంధించుకుంటున్నారు. 

ముందుగా గల్లా నే ఈ ట్విట్టర్ వార్ కి ఆద్యం పోసినప్పటికే జనసేన, పవన్ అభిమానులు దానిని అందుకున్నారు. పవన్ తన అభిమానులని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని పోస్ట్ చేసిన కొద్ది సేపటికి తన పెద్దరికం చాటుకునేలా జయదేవ్ మరో ట్వీట్ చేశారు. `నా అనుచరులు ఎవ్వరూ కూడా వ్యక్తిగత దాడులకు దిగవద్దు. బాడీ షేమింగ్కు పాల్పడవద్దు. వ్యక్తుల కుటుంబాలపై దూషణలు వద్దని హింసకు చోటివ్వకూడదు. ఇంతకుముందు ఇలా చేయలేదు. ఇకపై కూడా అదే కొనసాగించాలి అని కోరుకుంటున్నా` అంటూ గల్లా జయదేవ్ మరో ట్వీట్లో కోరారు. కాగా జయదేవ్ ఈ రెండు ట్వీట్లతో పవన్ ని డిఫెన్స్ లో పడవేశారు అనే చెప్పాలి. ఎందుకంటే కత్తి మహేష్ నుండి శ్రీ రెడ్డి దాకా అభిమానులు అన్నేసి మాటలు అంటుంటే మౌనంగానే ఉన్న పవన్ ఇప్పటికయినా నోరు విప్పి తన అభిమానులకి ఏమైనా చెబుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Galla Jayadev Tweets On Pawan Kalyan