పవన్ సినిమా ప్రకటించిన మహేష్ బావ !

రాజకీయాల్లో ఎప్పుడూ ఒకటే లెక్క ఉండదు, అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు ఇప్పుడు…ఆంధ్రప్రదేశ్‌లోనూ లెక్కలు మారుతున్నాయి. నాలుగేళ్ల నుండీ నడిచిన లెక్కలు…ఇప్పుడు మారిపోతున్నాయి. అప్పుడు మిత్రులైన వారు ఇప్పుడు శత్రువులవుతున్నారు నాడు శత్రువులుగా ఉన్నవారు మిత్రులవుతున్నారు. అవినీతిపరులు, అక్రమార్కులు అని తిట్టనవాళ్ల దగ్గరకే ఇప్పుడు నిజాయితీపరులు అంటూ వారి పంచన చేరడానికి ప్లాన్‌లు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా…ఇతర రాజకీయపార్టీలను తనవైపు కూడగడుతూ వెళుతోంది.

అలాగే గత కొద్దికాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు తెలుగుదేశం మీద కుట్ర చేస్తున్నాయని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. మరో పక్క పవన్ జగన్ కూడా ఇవి నిజం అనిపించేలా ఒకరిని ఒకరు తిట్టుకోవడం కాని కనీసం విమర్శించడం కూడా చేయట్లేదు. మొన్నటికి మొన్న పవన్ మీద కుట్ర చేయడానికి వైసేపీ నేతలు ప్రయత్నించారు అని స్వయంగా శ్రీ రెడ్డి ఫోనులో తెలిపినా తెలుగుదేశం ఈ కుట్రలు చేస్తోంది అని పవన్ ఆరోపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై మహేష్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో గల్లా జయదేవ్ చెబుతూ, ‘త్వరలో విడుదల కానున్న కొత్త చిత్రం.. ‘జగన్ పవన్’.. రచన, దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ .. మోదీ – షా ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ చిత్రం మీ ముందుకు రానుంది’ అని గల్లా జయదేవ్ ‘ఫేస్ బుక్’ పోస్ట్ చేశారు. అంటే పవన్ జగన్ లు మోడీ షా చెప్పిన బాటలో నడుస్తూ ప్రశాంత్ కోశోర్ పర్యవేక్షణలో సాగుతున్నారని ఆయన వ్యంగ్యంగా చెప్పారు.