మోడీ-షా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కొత్త చిత్రం… జ‌గ‌న్-ప‌వ‌న్

Galla Jayadev says YS Jagan and Pawan Kalyan’ movie in Modi production

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం గ‌మ‌నిస్తున్న వారంద‌రికీ ఒక విష‌యం అర్ధ‌మ‌వుతుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్రం ప్ర‌ద‌ర్శించిన నిర్ల‌క్ష్యానికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచేందుకు ప్ర‌ధాని మోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వైసీపీ, జ‌న‌సేన‌లను ఉప‌యోగించుకుంటున్నార‌ని. వైసీపీ అధినేత జ‌గ‌న్, జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్ర‌తిక్ష‌ణం ఈ విష‌యాన్ని రుజువుచేసుకుంటూనే ఉన్నారు. జ‌గ‌న్ కానీ, ప‌వ‌న్ కానీ… ప్ర‌త్యేక హోదా స‌హా ఇత‌ర అంశాల్లో టీడీపీ ప్ర‌భుత్వాన్ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునూ విమ‌ర్శిస్తారు కానీ… కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని గానీ… ప్ర‌ధాని మోడీని గానీ ప‌ల్లెత్తు మాట‌న‌రు. వారి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లన్నీ… టీడీపీ, చంద్ర‌బాబు చుట్టూనే తిరుగుతుంటాయి.

టీడీపీ మ‌ద్ద‌తుదారులు, సామాన్య ప్ర‌జ‌లే కాదు… వైసీపీ, జ‌న‌సేన అభిమానులు కూడా ఈ విష‌యాన్ని అంగీక‌రిస్తున్నారు. మోడీ ఆదేశం మేర‌కు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా జ‌గ‌న్, ప‌వ‌న్ ఒక్క‌ట‌వుతున్నార‌ని ప్ర‌జ‌లంతా చ‌ర్చించుకుంటున్నారు. ఈ విష‌యాన్ని టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సినిమా స్ట‌యిల్ లో సెటైరిక‌ల్ గా వివ‌రించారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న కొత్త చిత్రం… జ‌గ‌న్ ప‌వ‌న్… ర‌చన, ద‌ర్శ‌క‌త్వం ప్ర‌శాంత్ కిషోర్. మోడీ-షా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం మీ ముందుకు రానుంది అని గ‌ల్లా జ‌య‌దేవ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.