వన్ సైడ్ బ్యాటింగ్ కుదరదు చిరు

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ఒక ముఖ్యమైన విషయం గురించి మెగా స్టార్ హీరోలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని ప్రముఖ మీడియా ఛానెల్స్ సినిమా ఇండస్ట్రీ పై అసభ్యకరంగా డిబేట్స్ పెట్టడం అలాగే ఇష్టం వచ్చినట్లు వార్తలను ప్రసారం చేయడం జరుగుతున్నందు వల్ల ఇక సినిమాల యాడ్స్ వారికి ఏ మాత్రం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకి మెగా స్టార్ చిరంజీవి తన అభిప్రాయం తెలుపగా హీరోలందరు కొద్ది సమయం గడువు కావాలని కోరినట్టు తెలసింది. దీంతో మరో మూడు రోజుల తర్వాత వీరు మరలా కలుసుకునేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

అయితే ఇక్కడ చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసం తో కూడుకున్న విషయం. మీడియా సినిమాలని ప్రోమోట్ చేసినా టీఆర్పీ కోసమే సినిమా వాళ్ళ మీద పుకార్లు పుట్టించి బురద చల్లినా టీఆర్పీ కోసమే అంతే కాని ఒకరి మీద ఒకరికి వ్యక్తిగత ద్వేషాలు ఉండవు కదా ఇది కేవలం ఒక వ్యాపారం. మాములు వార్తల కంటే కూడా సినిమా వారి పై వచ్చే వార్తలకు సామాన్య ప్రజానీకం అత్యంత ఆసక్తి కనబరుస్తారు ఇది జగమెరిగిన సత్యం. ఇది కేవలం తెలుగులోనే కాదు అటు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ సంస్కృతి ఉంది. అయితే ఇప్పుడేదో కొత్తగా ఎదో అయ్యింది గగ్గోలు పెట్టటం చూస్తే ఏదయినా మనదాకా వస్తే తెలియదు అనిపిస్తుంది. ఇదే ఇండస్ట్రీకి చెందిన త్రిష బాత్ రూం విడియోని ఫుల్ డే చానల్స్లో వేసినప్పుడు, బాలకృష్ణ ఇంట్లో షూట్ అవుట్ జరిగినప్పుడు, హన్సిక వీడియో టెలికాస్ట్ చేసినపుడు ఏమీ అనిపించలేదా ?

ఇప్పుడు కేవలం పవన్ ని శ్రీ రెడ్డి , కత్తి మహేష్ తిట్టిన వాటిని ప్రసారం చేసారు అని, క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెర మీదకి తెచ్చారు అని ఇండస్ట్రీ మొత్తం కలిసి కట్టుగా ఉంటూ అందరు కలసి చానల్స్ ని నిషేదించడం అంటే కొందరు హీరోలకి సైతం మింగుడు పడలేదట. తెలుగు సినీపరిశ్రమలో మీడియాని అత్యంత ఎక్కువగా ఉపయోగించుకున్నది మెగా ఫ్యామిలీనే ఎందుకంటే ఆ ఒక్క ఫ్యామిలీలోనే అరడజను పైగా హీరోలు ఉన్నారు, నిన్న మొన్నటి దాకా తమకి కావాల్సి వచ్చినట్టు మీడియాని వాడుకుని ఈరోజు మీకు నచ్చక పోతే అసలు మీడియానే బహిష్కరిస్తారా ? సత్తా లేని వారిని కూడా హీరోలుగా నిలబెట్టేందుకు ఎన్ని సార్లు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వెళ్ళిన మీడియా వారికి లంచాలు ఇవ్వ చూపలేదు ? అంటే ఈరోజు మీమీద కొన్ని వార్తలు నెగటివ్ గా వస్తే ఇక బహిష్కరణ చేసేస్తారా ? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మీమీ వార్తలు వేయకపోతే చానళ్ళకి పెద్దగా నష్టం ఏమీ ఉండదు, ఎందుకంటే చానళ్ళు మీమీదే ఆధార పడి లేవు, వారికి రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, స్పోర్ట్స్, ఆద్యాత్మిక మొదలగు ఎన్నో జార్యక్రమాలు ఉంటాయి. కాని మీమీ సినిమాలు విడుదలవుతున్నాయి అని ప్రజలకి తెలిసే ఏకైక మార్గం మీడియా, అది వార్తల మధ్య వచ్చే యాడ్ రూపంలో అవ్వచ్చు, పొద్దున్న లేచి చూసే పేపర్ రూపంలో అవ్వచ్చు. జనానికి తెలియని మరో విషయం ఏంటంటే అత్యధిక టీఆర్పీ కలిగిన చానెళ్ళని చూస్కుని మరీ లక్షలు వెచ్చించి ఇప్పటిదాకా సినిమా ప్రమోషన్లు చేసే వీరు ఇప్పుడు అసలు చానళ్లె లేకుండా బహిష్కరిస్తామనడం బుద్ధి లేని చర్యగా చెప్పవచ్చు.

సినిమాని సక్సెస్ చేయాలన్నా బోల్తా కొట్టించాలన్నా న్యూస్ చానెల్స్ చేతిలోపని. ఎందుకంటే పెద్ద చానల్స్ కి ప్రకటనలు ఇవ్వకపోతే సినిమాకి నెగటివ్ టాక్ తెప్పిస్తారనేది ఇండస్ట్రీలో చిన్నవారి నుండి పెద్దవారి దాకా తెలిసిన సత్యం. ప్రకటనలు ఇవ్వకుంటేనే పరిస్థితి ఇలా ఉంటె ఇక సినిమా కంటెంట్ ఇవ్వం, నిషేదిస్తాం అంటే ఇక చానెళ్లు ఏమి చేస్తాయో వారి ఊహకే వదిలేద్దాం. ఈ పిచ్చి చర్యలు మానుకుని చానెళ్ళతో రాజీకి వచ్చి వివాదాలు దారితీసే నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం నిర్మాతలకు ఉపయుక్తం. ఎందుకంటే హీరోలు, నటులు ఉంటె చాలదు కదా అసలు హీరో నిర్మాత ఆయన్ని దృష్టిలో పెట్టుకుని మీమీ నిర్ణయాలు తీసుకుంటే ఇండస్ట్రీ నాలుగు కాలాల పాటు బాగుంటుది. చిరంజీవి కూడా వన్ సైడ్ బ్యాటింగ్ కష్టం అని తెలుసుకోవాలి, అందరిని ఒక సారి పోగుచేసినంత మాత్రాన వారంతా మన మాట విని చానళ్ళ బహిష్కరణ చేస్తారు అనుకోవడం మన మూర్ఖత్వం. ఇప్పటికయినా ఇలాంటి ఒంటెత్తు పోక్కడలు మాని కాస్త రియాలిటీలోకి వస్తే ఉన్న కాస్త పరువు అయినా మిగులుతుంది.