పేరును నిలుపుకున్న మహేష్‌!

bharath ane nenu movie compelets 50days

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన సూపర్‌ స్టార్‌ స్టార్‌డంను నిలుపుకున్నాడు. తన భరత్‌ అనే నేను చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన మహేష్‌బాబు 50 రోజులు పూర్తి చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో 25 థియేటర్లలో భరత్‌ 50 రోజులు పూర్తి చేసుకోవడం రికార్డుగా అభిమానులు చెబుతున్నారు. ఈ మద్య కాలంలో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో 50 రోజులు ఎక్కువ థియేటర్లలో ఆడిన సినిమాగా ఈ చిత్రం నిలిచిందని అంటున్నారు. 50 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా సినిమా ఇంకా ప్రదర్శింపబడుతూనే ఉంది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి బాహుబలి తర్వాత స్థానంను ఆక్రమించిన భరత్‌ అనే నేను చిత్రం థియేటర్ల సంఖ్యలో కూడా రికార్డును సొంతం చేసుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపించాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. నాన్‌ బాహుబలి రికార్డులు సొంతం చేసుకుని తీరుతుందని అంతా భావించారు. అన్నట్లుగానే బాహుబలి తర్వాత స్థానంలో నిలిచి సూపర్‌ స్టార్‌ తన పేరును నిలుపుకున్నాడు. సూపర్‌ స్టార్‌ అంటూ ఫ్యాన్స్‌ పిలుచుకుంటున్న పిలుపుకు న్యాయం జరిగిందని మహేష్‌బాబు సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి మహేష్‌బాబు చేసిన ఈ చిత్రంతో కెరీర్‌లో బెస్ట్‌ సినిమా ఆయన ఖాతాలో చేరింది. ప్రస్తుతం మహేష్‌బాబు తన 25వ సినిమాకు సిద్దం అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమాలో మహేష్‌బాబు గడ్డంతో కనిపించబోతున్నాడు. గడ్డం లుక్‌ ఇప్పటికే రివీల్‌ అయ్యింది.