త్రివిక్రమ్‌ వరుసగా..

Trivikram to direct a Movie with Nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాటల మాంత్రికుడు దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో సినిమా సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకునేవాడు. కాని ఇప్పుడు అలా కాదు. సంవత్సరంలో కనీసం ఒక్కటి అయినా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్‌ ఇదే సంవత్సరంలో ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంతో దసరాకు రాబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం తర్వాత వెంటనే వెంకటేష్‌తో ఒక చిత్రాన్ని ఈయన చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా వెంకీ, త్రివిక్రమ్‌ మూవీ రాబోతుంది. ఈ సమయంలోనే త్రివిక్రమ్‌ మరో సినిమాకు కూడా సిద్దం అవుతున్నాడు.

త్రివిక్రమ్‌, వెంకటేష్‌ల మూవీ కేవలం మూడు నెలల్లోనే పూర్తి అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ‘నువ్వునాకు నచ్చావ్‌’ సమయంలోనే వీరిద్దరి కాంబోలో ఒక మూవీ రావాల్సి ఉంది. కాని అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. అది ఇప్పుడు సాధ్యం కాబోతుంది. వచ్చే సంవత్సరం వెంకీతో సినిమా చేయగానే నానితో సినిమాను చేయబోతున్నాడు. నాని సినిమాకు ఇప్పటికే స్టోరీ లైన్‌ సిద్దం అయ్యింది. త్వరలోనే స్క్రిప్ట్‌ను మొదలు పెట్టబోతున్నాడు. వచ్చే వేసవిలో సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంవవత్సరంలో త్రివిక్రమ్‌ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. వచ్చే సంవత్సరంలో కూడా వెంకీ మరియు నానిల సినిమాలు రాబోతున్నాయి. మొత్తానికి త్రివిక్రమ్‌ వరుసగా సినిమాలను చేస్తూ దూసుకు పోతున్నాడు.