భూమిక కూడా యూటర్న్‌ తీసుకుంటే..?

Bhumika joins Samantha's U Turn remake

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రెండు సంవత్సరాల క్రితం కన్నడంలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘యూటర్న్‌’ చిత్రంను సమంత ఏరికోరి మరీ రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ మద్య యూటర్న్‌ను సమంత స్వయంగా రీమేక్‌ చేయబోతుందని, మొదటి సారి ఈ చిత్రంతో సమంత నిర్మాతగా మారబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే సమంత రీమేక్‌కు నిర్మించడంలో ఆసక్తి చూపించలేదు. అయితే యూటర్న్‌ రీమేక్‌లో మాత్రం హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు.

యూటర్న్‌ చిత్రంలో హీరోయిన్‌తో పాటు కీలక పాత్రలో భూమిక కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పాత్రకున్న ప్రాముఖ్యత నేపథ్యంలో భూమిక ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. గత సంవత్సరం ‘ఎంసీఏ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్‌ హీరోయిన్‌ భూమిక మళ్లీ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుండగా, ఈ నెల నుండే భూమిక రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. సమంతతో పాటు భూమిక కూడా ఈ చిత్రంలో నటిస్తే సినిమా స్థాయి ఇంకాస్త పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.