బాలయ్య కొత్త సినిమా కోసం భారీ సెట్…..

బాలయ్య కొత్త సినిమా కోసం భారీ సెట్.....
Cinema News

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్స్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో బాలయ్య – విలన్ల మధ్య యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ స్టార్ట్ చేస్తారంట . ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది . మరి ఈ మూవీ లో బాలయ్య ఫ్యాన్స్ కోసం బాబీ ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.

బాలయ్య కొత్త సినిమా కోసం భారీ సెట్.....
Bala Krishna

అన్నట్టు ఈ మూవీ బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ మూవీ లో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఏది ఏమైనా ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ లో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.