షూటింగ్‌లో రవితేజకు గాయాలు

Bike Accident For Hero Raviteja In Nela Ticket Movie Shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టచ్‌ చేసి చూడు’ డిజాస్టర్‌గా మిగిలింది. ఆ చిత్రం ఫ్లాప్‌ నుండి వెంటనే తేరుకున్న రవితేజ ప్రస్తుతం కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ‘నేల టికెట్‌’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రవితేజ చాలా కష్టపడుతున్నాడు అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. అంతలోనే రవితేజకు షూటింగ్‌లో గాయాలు అయ్యాయి అంటూ సమాచారం అందుతుంది. ఒక స్పోర్ట్స్ బైక్‌పై రవితేజ రైడ్‌ చేసే సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలోనే బండిని అదుపు చేయలేక రవితేజ కింద పడ్డాడని, దాంతో గాయాలు అయ్యాయి అంటూ సమాచారం అందుతుంది. 

గతంలో అలవాటు లేని మోనో వీల్‌ వెయికిల్‌తో రవితేజ చేసిన ప్రయోగం విఫలం అవ్వడంతో గాయాలు అయ్యాయి. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మొదట ఈ షాట్‌ను డూప్‌తో ప్లాన్‌ చేశాడట. కాని రవితేజ మాత్రం తానే చేస్తాను అని, తనకు బండి నడపడంలో అలవాటు ఉందంటూ మోనోవీల్‌ ఎక్కడం, ఆ బండి కాస్త పడిపోవడంతో  గాయాలు అవ్వడం జరిగిపోయింది. ప్రమాదంలో పెద్దగా గాయాలు ఏమీ కాలేదని, కాకుంటే వారం రోజులు రెస్ట్‌ తీసుకోవాలని డాక్టర్లు రవితేజకు సూచించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. గత కొంత కాలంగా బిజీ బిజీగా గడుపుతున్న రవితేజ ప్రమాదంతో కొన్ని రోజులు షూటింగ్‌లకు దూరంగా ఉండబోతున్నాడు.