హృదయం లేని మనుషుల్లారా ఇక ఆపేయండి

Ekta Kapoor Comments On Sridevi Dead

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
శ్రీదేవి మరణం గురించి మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆమెది సహజ మరణం కాదని కొందరు, ఆమె అందంగా కనిపించేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకుందని మరికొందరు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. తాను ఎప్పుడు అందంగా కనిపించాలని భావిస్తుందని, అందుకే శ్రీదేవి పలు సార్లు ఆపరేషన్‌ు చేయించుకుందని, అలాగే మోతాదుకు మించిన ఔషదాలు తీసుకోవడంతో పాటు, కాస్మోటిక్స్‌ను వాడేదని, అందుకే ఆమెకు గుండెపోటు వచ్చింది అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మీడియాలో శ్రీదేవి గురించి వస్తున్న కథనాలపై బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ ఏక్తా కపూర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎలాంటి అనారోగ్యం లేని వారు, గతంలో ఒక్కసారి కూడా గుండెపోటు రాని వారు మొదటి సారి గుండెపోటుకే మరణించే అవకాశం ఉందని, ఆ విషయాన్ని స్వయంగా తాను డాక్టర్‌ను కనుకున్నాను అంటూ ఏక్తా కపూర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. హృదయం లేని వారు ఇలా ఆమె మరణం గురించి పిచ్చి రాతలు రాస్తున్నారని, ఆమె మరణం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసిందని ఏకా ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీదేవి మరణం గురించి పుకార్లు రాస్తున్న మీడియా వారికి హృదయం లేదని, వారు ఇకనైనా ఆమె మరణం గురించి తప్పుడు విషయాలు రాయకుండా ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఏక్తా ట్వీట్‌ చేసింది. కొన్ని సార్లు ఎంతో శక్తివంతమైన వారు కూడా తమ బలహీనమైన గుండె కారణంగా ఇలా గుండెపోటుకు గురవుతారని, అలాంటప్పుడు వారిని ఇలా చులకనగా మాట్లాడకూడదు అంటూ ఏక్తా మీడియాకు హితబోధ చేస్తోంది.