ఆ స్టార్ హీరోతో నటించొద్దు… కండిషన్ పెట్టిన జాన్వి కపూర్ తండ్రి…!

జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో శ్రీదేవి కుమార్తెగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ధడక్ అనే హిందీ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది ఈ అమ్మడు.

తన తల్లి శ్రీదేవి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగారు. ఇక తన తల్లి బాటలోనే తను కూడా దక్షిణాది మూవీ లలో నటించాలని ఆశ పడుతోందట. ఆమె కోరిక మేరకు డైరెక్టర్లు కూడా ఆమెను దక్షిణాది మూవీ లలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారంట . ఇక చాలా ప్రయత్నాలు తర్వాత జాన్వి కపూర్ దేవర మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన మొదటిసారిగా తెలుగులో జతకట్టనుంది జాన్వి కపూర్.

తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించాలని జాన్వి కపూర్ ప్రయత్నాలు చేస్తోందట. తమిళ చిత్రాల మీద ఉన్న ఆసక్తితో జాన్వీ కపూర్ తమిళ సినిమాలను ఎక్కువగా చూస్తుందట. ఈ క్రమంలోనే తన తండ్రి జాన్వికపూర్ కు ఒక కండిషన్ పెట్టారంట. హీరో ధనుష్ తో సినిమా చేయకూడదని కండిషన్ పెట్టాడట. స్టార్ హీరో అయిన ధనుష్ సరసన ఎందుకు వద్దన్నాడో అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు.