నటించకు అంటూ రైతు బిడ్డపై విరుచుకుపడ్డ అమర్ దీప్..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 7 పూర్తి చేసుకుని రెండో వరంలోకి అడుగు పెట్టింది. మొదటివారం చివరిలో కిరణ్ రాథోడ్ హౌస్ నుండి ఎలిమినేట్ బయటికి వెళ్ళిపోయారు. ఇక రెండోవారంలో కంటెస్టెంట్లు రెండు జట్లుగా విడిపోయాయి. టెలివిజన్ సీరియల్‌లో నటించే నటి నటులందరూ ఒక టీంగా, హీరో శివాజీ సపోర్ట్ చేసే టీమ్ మరో జట్టుగా విడిపోవడం జరిగింది. ఇకపోతే రెండోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా బిగ్బాస్ హౌస్ సభ్యులు ఒక్కొక్కరు తమ అసలు స్వరూపాన్ని బయట పెట్టడం మొదలుపెట్టారు. ఈసారి నామినేషన్ ప్రక్రియలో రైతు బిడ్డగా చెప్పుకొనే పల్లవి ప్రశాంత్‌పై ఇంటి సభ్యుల మాటలతో యుద్ధానికి దిగారు.

ఈ నామినేషన్ల ప్రక్రియలో మొదట షకీలా, సింగర్ దామిని ప్రశాంత్‌పై మాటలతో దాడి చేశారు. న ఇంటిలో ఏ గేమ్ ఆడుతున్నావు..? నీ ఆట నాకు కనిపించడం లేదు అంటూ ప్రశాంత్ పై మండిపడ్డారు. నీకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు, ఎప్పుడు నీ గురించి నీవే చెప్పుకొంటావు అని దామిని కోపంగా అరిచింది. ఇక డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. నీవు రైతు బిడ్డవని చెప్పుకొంటూ సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నావు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అవును.. నేను రౌతు బిడ్డనే.. నేను ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకొంటున్నానని పల్లవి ప్రశాంత్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాడు.

డాక్టర్ గౌతమ్ పల్లవి ప్రశాంత్‌ను నువ్వు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే లక్ష రూపాయలు వస్తాయి. నీకు డబ్బు సంపాదించడం తెలుసని టార్గెట్ చేస్తూ చెప్పుకొచ్చాడు. దానికి గాని పల్లవి ప్రశాంత్ నాకు ఆ డబ్బు అవసరం లేదు. నాకు అలా డబ్బు వస్తే ఆ డబ్బును పేద రైతుకు ఇస్తానని పల్లవి ప్రశాంత్ చెప్పే ప్రయత్నం చేస్తుండగానే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ పై మాటలు యుద్ధం మొదలుపెట్టాడు. పేద రైతుకు ఇస్తానని చెబుతున్నావు. కానీ రైతు స్థానంలో లారీ డ్రైవర్, రిక్షా డ్రైవర్, ఆటో డ్రైవర్‌కు ఇస్తానని చెప్పడం లేదుని అమర్ దీప్ చాలా సీరియస్ గా అరిచాడు.

నా ముందు నటించకు.. నీకంటే గొప్ప నటుడిని నేను అంటూ.. అలాగే ప్రతిసారి రైతు బిడ్డ అంటూ సెంటిమెంట్ డైలాగ్ కొట్టబాకు అంటూ ప్రశాంత్ పై అమర్దీప్ బాగా సీరియస్ అయ్యాడు. ఇక నువ్వే కాదు మా తాతలు కూడా రైతులే అంటూ అమర్దీప్ కి సపోర్ట్ గా ఆట సందీప్ ముందుకు వచ్చాడు. బిగ్‌బాస్‌లోకి రావడానికి స్టూడియో చుట్టు కుక్కలా తిరిగాను అని పల్లవి ప్రశాంత్ చెప్పడం స్టార్ట్ చేయగానే రతిక ప్రశాంత్ మాట కు అడ్డు పడి.. కుక్కలా తిరిగి నువ్వు ఏం చేస్తున్నావు అని అతనిపై ఫైర్ అవటం మొదలుపెట్టింది. ఇక డాక్టర్ గౌతమ్ దీన్ని ఒక రకమైన మానసిక వ్యాధి అంటారని.. ఇలాంటి వాళ్లు వారి మాటలు తప్ప, ఇతరులు మాటలు పట్టించుకోరు అని ప్రశాంతపై కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యాధికి నీ దగ్గర గోళీలు ఉంటాయా అన్న అని ప్రశాంత్ అనగానే.. ఉంటాయని గౌతమ్ ఆన్సర్ ఇవ్వడంతో.. ఇంటికి పోయినప్పుడు నాతో పాటు తీసుకుపోతానని ప్రశాంత్ సమాధానం గురించి జరిగింది