నిన్నగ్రహణం చంద్రుణ్ణి మిస్ అయ్యారా… ఇప్పుడు చూడండి…

Blood Moon 2018

ఖగోళంలో నిన్న రాత్రి ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. నిన్నఅర్ధరాత్రి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణంతో పాటు ‘బ్లడ్‌మూన్’ను వీక్షించి ప్రజలు పులకించిపోయారు. గ్రహణం మొదలు కాగానే టెలిస్కోపులు, ఎక్స్‌రే లాంటి తదితర పరికరాలతో రోడ్లు, భవంతులపైకి ఎక్కి ఈ అద్భుతాన్ని వీక్షించారు. 21వ శతాబ్దంలోనే సంపూర్ణ సుదీర్ఘ చంద్రగ్రహణం కావడం, అందునా ‘బ్లడ్ మూన్’ కావడంతో జనం దీనిపై విపరీతమైన ఆసక్తి కనబరిచారు. ప్రపంచ వ్యాప్తంగా నగరాలు, పల్లె ప్రజలు గ్రహణం సమయం వరకు వేచి చూసి మరీ ఆకాశంలో అద్భుతాన్ని చూశారు. సరిగ్గా 11.45నిమిషాలకు చంద్రగ్రహణం ఆరంభమైంది.

దాదాపు గంటా 43 నిమిషాలపాటు ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించగలిగారు. మొదట్లో చిన్నగా కనిపించిన చంద్రుడు సమయం గడిచే కొద్దీ పెద్దగా మారింది. అందరినీ అలరించింది. మళ్లీ 2123లో ఈ అద్భుతం ఖగోళంలో ఆవిష్కృతం కానుంది.