ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ హీరో షాకింగ్‌ వ్యాఖ్యలు

Bollywood Hero Shocking Comments On NTR

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Bollywood Hero Shocking Comments On NTR

ఎన్టీఆర్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాత ఎన్టీఆర్‌ నట వారసత్వంకు పూర్తి న్యాయం చేయగల సత్తా జూనియర్‌కు మాత్రమే ఉందని పలు సందర్బాల్లో వెళ్లడైంది. ‘టెంపర్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ కనబర్చిన నటనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా ఎన్టీఆర్‌ కోర్టు సీన్‌లో కనబర్చిన నటన అద్బుతంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్బుతమైన నటులు కొందరు మాత్రమే ఉన్నారు. అందులో ఎన్టీఆర్‌ ఒక్కడుగా చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కూడా ఒప్పుకున్నాడు.

ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందీలో భారీ బడ్జెట్‌తో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. సినిమా రీమేక్‌కు సంబంధించి రణ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలుగులో ఎన్టీఆర్‌ చేసిన స్థాయిలో తాను హిందీలో చేయడం అంటే కాని పని అని, నటనలో ఎన్టీఆర్‌ శిఖరం అని, చిన్న వయస్సులోనే అద్బుత పాత్రలు పోషించి, నటనలో ఉన్నత శిఖరంగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు సమానంగా తాను నటించడం అంటే కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలో ఎన్టీఆర్‌ ఏ స్థాయి నటుడో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు:

ఎన్టీఆర్‌కు పోటీగా రానా?

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పంచాయితీ అందుకా?