ఇక వాళ్ళతో కటీఫ్ అంటున్న జేసీ.

jc diwakar reddy fires on air lines

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశాఖ ఎయిర్ పోర్ట్ లో తాను చేసిన గొడవ గురించి లోకమంతా చూసినా జేసీ దివాకర్ రెడ్డి తీరు మారలేదు. జరిగినదానికి స్పందించిన ఇండిగో జేసీ కి వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద కొందరు పత్రికా ప్రతినిధులు జేసీ ప్రతిస్పందన కోసం ప్రయత్నించి షాక్ కి గురి అయ్యారు. వచ్చింది విలేకరి ఫోన్ అని తెలియగానే జేసీ ఫైర్ అయిపోతున్నారు. అసలు జరిగిందంతా మీ వల్లే, మీతో మాట్లాడేది లేదని జేసీ వారికి తేల్చి చెప్పారట. ఈ వ్యవహారం మీద మీడియా ప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎయిర్ పోర్ట్ లో వీరంగం వేసింది ఆయన, చర్యలు తీసుకుంది విమానయాన సంస్థలు అయితే మధ్యలో మా తప్పు ఎక్కడుందని వారు ఆశ్చర్యపోతున్నారు. జేసీ తో కాస్త దగ్గరగా మెసిలే అనంత జిల్లా విలేకరులకు కూడా దాదాపు ఇదే అనుభవం ఎదురైందంట.

ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే జేసీ దివాకర్ రెడ్డి కి ఇంకో షాక్ తగిలింది. విశాఖ ఎయిర్ పోర్ట్ కి తాను గంట ముందే వచ్చానని, ఇండిగో సిబ్బందిదే తప్పని జేసీ చెబుతున్న మాటల్లో నిజం లేదని తేలింది. ఈ విషయాన్ని విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు స్వయంగా వెల్లడించారు. జేసీ చెబుతున్నట్టు ఆయన గంట ముందు రాలేదనడానికి సీసీ టీవీ దృశ్యాలు సాక్ష్యమని గజపతిరాజు వివరించారు. దీంతో ఎవరి మీద ఎంత అలిగినా సారీ చెప్పక తప్పనిసరి పరిస్థితి జేసీ కి ఏర్పడింది. కొద్ది రోజుల కిందట జేసీ మేనల్లుడు దీపక్ రెడ్డి హైదరాబాద్ భూకుంభకోణంలో ఇరుక్కుని జైలు పాలయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా తోడు కావడంతో జేసీ తీవ్రం గా హర్ట్ అయ్యారట.