రాజకీయాలకు బాలయ్య గుడ్ బై?

balakrishna goodbye to politics

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Balakrishna Good Bye To Politics

వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా స్పీడ్ తగ్గుతుంది. కానీ నటసింహం నందమూరి బాలయ్య మాత్రం సినిమాల్లో స్పీడ్ పెంచేశారు. పెద్ద హీరోలంతా ఏడాదికి ఒక సినిమా తీయడమే కష్టం అనుకుంటే బాలయ్య మాత్రం సంవత్సరానికి రెండుమూడు సినిమాలు చేసేస్తున్నారు. 101 వ సినిమా పైసా వసూల్ షూటింగ్ తుది దశలో ఉండగానే ఇంకో సినిమాకి అంతా రెడీ చేసి పెట్టారు. కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మాతగా సినిమా చేయబోతున్నారు. సినీ రంగంలో ఇంత ఫాస్ట్ గా దూసుకెళ్తున్న బాలయ్య ఎమ్మెల్యేగా హిందూపురం లో కూడా ఇదే స్పీడ్ చూపించడం లేదని ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గాన్ని బాలయ్య నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శలు వచ్చినా బాలయ్య లెక్కచేయకపోవడానికి ఓ కారణం ఉందట. అదే రాజకీయాలకు గుడ్ బై కొట్టాలని బాలయ్య భావిస్తున్నారట.

సినిమాల్లో గౌరవంగా వున్న తాను రాజకీయాల విషయం వచ్చేసరికి ఆ స్థాయిలో రాణించలేకపోతున్నట్టు బాలయ్య ఫీల్ అవుతున్నారట. ఇటీవల హిందూపురం లో తనకు వ్యతిరేకంగా ఓ భారీ ర్యాలీ తీసినప్పటి నుంచి బాలయ్య బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. బాగా ఆలోచించుకున్న ఆయన రాజకీయాలకు గుడ్ బై కొట్టే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పోర్చుగల్ నుంచి వచ్చాక సీఎం చంద్రబాబుకి తన నిర్ణయం ఆయన అభిప్రాయం తెలుసుకుని ఫైనల్ డెసిషన్ ప్రకటించాలని బాలయ్య అనుకుంటున్నట్టు సమాచారం.

హరికృష్ణ కి టీటీడీ ఛైర్మన్ మాటలో నిజముందా?

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పంచాయితీ అందుకా?