బాబోయ్‌.. నన్ను కాదు అరెస్ట్‌ చేసింది

Anchor Pradeep Was Arrested In check Bounce Case

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Anchor Pradeep Arrested In Check Bounce Case

యాంకర్‌ ప్రదీప్‌ చెక్‌ బౌన్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి, చంచల్‌గూడ జైలులో రోజంతా ఉన్నాడు అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో భారీగా ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. ప్రముఖ మీడియాల్లో కూడా ఈ వార్త ప్రధానంగా రావడంతో కూడా ప్రదీప్‌ సన్నిహితులు అంతా కూడా విచారించడం మొదలు పెట్టారు. యాంకర్‌ ప్రదీప్‌కు రోజుకు వందల సంఖ్యలో కాల్స్‌ వస్తున్నాయి. దాంతో చేసేది లేక తనపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు అని, తాను జైలుకు కూడా వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

తాజాగా ప్రదీప్‌ మీడియాతో మాట్లాడుతూ. వార్తలు వస్తున్నట్లుగా తానేం జైలుకు వెళ్లలేదు, కనీసం తనపై చెక్‌ బౌన్స్‌ కేసు కూడా నమోదు కాలేదు. మీడియా అపార్థం చేసుకుని తన గురించి వార్తలు రాసినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే మీడియాలో వచ్చి వార్తలు అబద్దమే కాని, ప్రదీప్‌ అరెస్ట్‌ అయిన విషయం మాత్రం నిజమే. అంటే యాంకర్‌ ప్రదీప్‌ కాకుండా, సీనియర్‌ బుల్లి తెర నటుడు ప్రదీప్‌ అరెస్ట్‌ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ అనే వ్యక్తికి ప్రదీప్‌ కొన్నాళ్ల క్రితం ఒక చెక్‌ ఇవ్వడం, ఆ చెక్‌ బౌన్స్‌ కావడం జరిగింది. దాంతోనే సదరు ప్రదీప్‌పై కేసు నమోదు అవ్వడం, పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపడం, బెయిల్‌పై బయటకు రావడం జరిగింది.

మరిన్ని వార్తలు

నాగబాబుకు పునర్‌వైభవం దక్కేనా?

‘బాహుబలి 2’ 50 రోజులు ఎన్ని థియేటర్లు?