అబ్బాయిల కన్నా ముందున్న అబ్బాయిలు

అబ్బాయిల కన్నా ముందున్న అబ్బాయిలు
అమ్మాయిలు ఏడాదిలో 71 రోజులు ఫోన్‌‌కు అతుక్కుపోతున్నారట. అబ్బాయిలతో పోలిస్తే ఇది రెండు వారాలు ఎక్కువట. ది స్టడీ ఫర్‌‌ టిక్‌‌ వాచెస్‌‌ ఈమధ్య బ్రిటన్‌లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రోజులో 4 గంటల 42 నిమిషాలు అమ్మాయిలు ఫోన్‌‌తోనే గడిపేస్తున్నారని సర్వే చెప్పింది. అదే అబ్బాయిలు 3 గంటల 49 నిమిషాలు వాడుతున్నారంది. ఫోన్‌‌ ఎక్కువగా వాడుతున్న వారిలో ముందుంది లండన్‌‌ వాళ్లని సర్వే తేల్చింది. వీళ్లు రోజులో 5 గంటలు ఫోన్‌‌ వాడుతున్నారని చెప్పింది.
మ‌రోవైపు…ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తోంది. ఇంటి వద్దకే వచ్చి, పనులు చక్కబెట్టే యాప్స్, వెబ్ సైట్లు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు బాత్రూం క్లీనింగ్ నుంచి ఎలక్ట్రీషియన్ వర్క్స్​వరకు అన్నింటికి పని మనుషులపైనే ఆధారపడేవారు. అవే పనులను అంతా ఇప్పుడు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో చేయించుకుంటున్నారు. నైపుణ్యం ఉన్నవారి కోసం ఎక్కడికీ తిరగాల్సిన పనిలేకుండానే కూర్చున్న చోటనే అందుబాటు ధరల్లో సర్వీస్ పొందే వీలు కలుగుతోంది.
ఇప్పటికే షాపింగ్, లాడ్జింగ్, టికెట్ బుకింగ్, హోటల్ భోజనం వరకు అన్నీ ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్‌లతో జరిగిపోతుండగా, ఆ వరుసలోకి సర్వీస్ ప్రొవైడర్లు వచ్చేశారు. ఇంట్లో అప్పటివరకు పనిచేస్తున్న వస్తువులకు రిపేర్లు, ఇంటి పనులను క్షణాల్లో చక్కబెట్టేందుకు అలా పిలిస్తే ఇలా వచ్చేస్తున్నారు. మొబైల్ లో బుక్ చేసుకున్న అరగంటలోనే సర్వీస్ అందిస్తున్నారు. వీటిని వాడేవారిలో ఎక్కువగా మహిళలే  ఉంటున్నారు.
ఉద్యోగం, వ్యాపారం చేసే మగవాళ్లు బయటకెళ్లిపోతే, ఇంటి పనులు పెండింగ్ లో పడిపోతుంటాయి. అందుబాటు ధరల్లో ఆన్​లైన్​లో లభిస్తుండటంతో మహిళలే మొబైల్ లో అపాయిమెంట్ చేస్తున్నారని హౌజ్ జాయ్ ప్రతినిధులు వెల్లడించారు.