వెండితెర బ్రహ్మ.. బుల్లి తెర ఎంట్రీ…?

Brahmanandam Hotstar In Star Maa Tv A Comedy S

తెలుగు సినిమా ప్రేక్షకులకు కామెడీ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హాస్య బ్రహ్మగా తనకంటూ గుర్తింపు దక్కించుకుని దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏళేసిన రారాజు బ్రహ్మానందం. గత కొంత కాలంగా బ్రహ్మానందం పోషించిన పాత్రలు నవ్వించలేక పోతున్నాయి. బ్రహ్మానందంను దర్శకులు కొత్తగా చూపించలేక పోతున్నారు. ఎప్పుడు ఒకే మాదిరిగా చూపించే ప్రయత్నం చేస్తున్న కారణంగా బ్రహ్మానందం వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు. ఈమద్య కాలంలో బ్రహ్మానందంకు అసలు ఆఫర్లు లేకుండా పోయాయి. తెలుగు సినిమా పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తాజాగా బుల్లి తెరపై తనదైన శైలిలో నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

brahmandham-1

స్టార్‌ మాటీవీలో బ్రహ్మానందం హోస్ట్‌గా ఒక కామెడీ షో ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ప్రస్తుతం షోకు సంబంధించిన ఆడీషన్స్‌ను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టార్‌ మాటీవీలో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ తర్వాత ఈ కామెడీ షో ప్రారంభం అవ్వబోతుందని తెలుస్తోంది. ట్రైలర్‌ను విభిన్నంగా డిజైన్‌ చేసి షోపై ఆసక్తి కలిగేలా నిర్వాహకులు చేశారు. బ్రహ్మానందం ఎంట్రీ ఇవ్వగానే ఆడిటోరియంలోని జనాలు అంతా కూడా నిల్చుని మరీ నవ్వేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే బ్రహ్మానందం స్టాండప్‌ కామెడీ అంటే కూర్చుని కూడా నవ్వొచ్చు అంటూ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. ఈటీవీ జబర్దస్త్‌ కామెడీ షోకు ఇది పోటీ అన్నట్లుగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి బ్రహ్మానందం ఈ సెంకండ్‌ ఇన్నింగ్స్‌ను చక్కగా వినియోగించుకుని విజయాన్ని సొంతం చేసుకుంటాడా అనేది చూడాలి.

brahmandham